చాక్లెట్లు చూపించి 52 ఏళ్ల వ్యక్తి లైంగిక వేధింపులు
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలోని ఓ పాఠశాలలో నలుగురు బాలికలను లైంగికంగా వేధిస్తున్న 52 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. గత ఆరు నెలలుగా అతను బాలికలను వేధిస్తున్నట్లు చెప్పారు. నిందితుడిని సూర్యనారాయణ రెడ్డిగా గుర్తించారు. అతను దర్జీ.

ఇతని ఇల్లు ఎలిమెంటరీ పాఠశాలకు పక్కన ఉంది. దీంతో, అతను చిన్నారులు బయటకు వచ్చినప్పుడు చాక్లేట్లు, బిస్కట్లు తదితరాలు ఆశ చూపించి, వారిని రప్పించుకునే వాడు. వారిని ఎక్కడెక్కడో ముట్టుకునే వాడు.
అతని బాధిత నలుగురు బాలికలలో ముగ్గురు ఏడేళ్లలోపే వారే. నాలుగో బాలికకు తొమ్మిదేళ్లు. ముగ్గురు మూడో తరగతి, తొమ్మిదేళ్ల బాలిక ఐదో తరగతి చదువుతోంది. ఈ విషయం ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులకు విషయం తెలియగానే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. అతని పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications