ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా: 50వేలకు తగ్గిన యాక్టివ్ కేసులు, జిల్లాల వారీగా

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత పది రోజులుగా తగ్గుకుంటూ వస్తున్న కరోనా పాజిటివ్ కేసులు తాజాగా స్వల్పంగా పెరిగాయి. అయితే, కొత్తగా నమోదైన కరోనా కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్యే ఎక్కువగా ఉండటం గమనార్హం. గత కొద్ది రోజులుగా కోలుకుంటున్నవారి సంఖ్య ఎక్కువగా నమోదవుతుండటం ఊరటనిచ్చే అంశంగా మారింది.

ఏపీలో కొత్తగా 5795 కరోనా కేసులు, 33 మంది మృతి

ఏపీలో కొత్తగా 5795 కరోనా కేసులు, 33 మంది మృతి

గత 24 గంటల్లో 65,889 నమూనాలను పరీక్షించగా 5795 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 7,29,307కి చేరింది. ఒక్క రోజు వ్యవధిలో కరోనా బారినపడి 33 మంది మరణించారు. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

జిల్లాల వారీగా మరణాలు..

జిల్లాల వారీగా మరణాలు..

జిల్లాల వారీగా మృతుల వివరాలను గమనించినట్లయితే.. కృష్ణా జిల్లాలో ఆరుగురు, ప్రకాశంలో ఐదుగురు, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో నలుగురు చొప్పున, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ముగ్గురు చొప్పున, గుంటూరు, నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఇద్దరు చొప్పున, కడప, విజయనగరం జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించారు. తాజా మరణాలతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 6052కు చేరింది.

ఏపీ జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు

ఏపీ జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు

ఏపీ జిల్లాల వారీగా కొత్త కేసులను గమనించినట్లయితే.. అనంతపురం జిల్లాలో 209, చిత్తూరులో 970, తూర్పుగోదావరిలో 801, గుంటూరులో 441, కడపలో 434, కృష్ణాలో 482, కర్నూలులో 123, నెల్లూరులో 451, ప్రకాశంలో 580, శ్రీకాకుళంలో 142, విశాఖపట్నంలో 303, విజయనగరంలో 163, పశ్చిమగోదావరి జిల్లాలో 696 కొత్త కేసులు నమోదయ్యాయి.

50వేలకు తగ్గిన యాక్టివ్ కేసులు..

50వేలకు తగ్గిన యాక్టివ్ కేసులు..


కాగా, గత 24 గంటల్లో 6046 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 6,66,433కు చేరింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 62,16,240 నమూనాలను పరీక్షించినట్లు వైద్య శాఖ వెల్లడించింది.
ప్రస్తుతం రాష్ట్రంలో 50,776 యాక్టివ్ కేసులున్నాయి. ఏపీలో కోలుకుంటున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒకప్పుడు లక్షకు చేరిన యాక్టివ్ కేసులు ఇప్పుడు సగానికి తగ్గడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+