Doctors Death Due to Coronavirus: దేశంలో ఇప్పటివరకూ 594 మంది వైద్యులు-తెలుగు రాష్ట్రాల్లో 64 మంది
కరోనా సెకండ్ వేవ్‌లో ఎంతోమంది వైద్యులు సైతం బలి అవుతున్నారు. తాజాగా ఏపీలోని సఖినేటిపల్లి మండలం మోరి గ్రామానికి చెందిన ఓ వైద్య విద్యార్థిని కరోనాతో మృతి చెందింది. ఉన్నత చదువులు చదివి చేతికి అందివచ్చిన బిడ్డ ఇలా అర్థాంతరంగా కరోనాకు బలవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
ఎంబీబీఎస్ ఫస్ట్ క్లాసులో పాసైన ఆ అమ్మాయి ఏలూరు ఆశ్రమంలో కోవిడ్ రోగులకు వైద్య సేవలందించారు. ఈ క్రమంలోనే కోవిడ్ బారినపడ్డ ఆమె కొద్దిరోజుల క్రితం స్వగ్రామం మోరి వచ్చి ఇంట్లోనే ఉంటున్నారు. సోమవారం(మే 31) శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో స్థానిక కోవిడ్ సెంటర్‌లో చేరారు. మంగళవారం(జూన్ 1) ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆమె మృతి చెందారు. వైద్య విద్యార్థిని మృతి ఆమె కుటుంబంతో పాటు గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

కరోనా సెకండ్ వేవ్‌లో దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 594 మంది వైద్యులు చనిపోయినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మంగళవారం వెల్లడించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 32 మంది,తెలంగాణలో 32 మంది వైద్యులు చనిపోయినవారిలో ఉన్నారు. అత్యధికంగా ఢిల్లీలో 107 మంది,బిహార్‌లో 96 మంది,ఉత్తరప్రదేశ్‌లో 67 మంది వైద్యులు కరోనా బారినపడి మృతి చెందారు. అంటే ఈ మూడు రాష్ట్రాల్లో కలిపి 45 శాతం మంది వైద్యులు మృతి చెందారు.
Recommended Video
ఆ తర్వాతి స్థానాల్లో రాజస్తాన్-43,జార్ఖండ్-39ఆంధ్రప్రదేశ్-32,తెలంగాణ-32,పశ్చిమ బెంగాల్-25,తమిళనాడు-21,ఒడిశా-22 ఉన్నాయి. అత్యల్పంగా పుదుచ్చేరిలో ఒకరు,ఉత్తరాఖండ్,గోవా రాష్ట్రాల్లో ఇద్దరు చొప్పున వైద్యులు కోవిడ్‌తో మృతి చెందారు. చత్తీస్‌గఢ్‌లో ముగ్గురు,హర్యానాలో ముగ్గురు,పంజాబ్‌లో ముగ్గురు,అసోం,కర్ణాటకల్లో 8 మంది చొప్పున,మధ్యప్రదేశ్‌లో 16 మంది,మహారాష్ట్రలో 17 మంది వైద్యులు మృతి చెందారు.












Click it and Unblock the Notifications