మట్కా ముఠా గుట్టు రట్టు...భారీ మొత్తంలో నగదు, గంజాయి స్వాధీనం

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu

అనంతపురం: అనంతపురంలో హైటెక్ పద్దతిలో భారీ స్థాయిలో మట్కా నిర్వహిస్తున్నఓ ముఠా గుట్టు రట్టైంది. హుబ్లీను కేంద్రంగా చేసుకొని అనంతపురంలో మట్కా నిర్వహిస్తున్న ఆరుగురు బీటర్లను పోలీసులు అరెస్టు చేశారు.

మట్కా నిర్వాహకులను బీటర్లుగా పిలుస్తారు. పోలీసులు ఈ మట్కా బీటర్ల నుంచి నుంచి రూ. 20 లక్షలు, 4 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలోని హుబ్లీ కేంద్రంగా హైటెక్‌ పద్దతిలో ఈ మట్కా దందా జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో నిఘా పెట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

6 matka organisers held; ganja, cash seized

మట్కా లో బీటరల్లు సింగిల్‌ డిజిట్‌కు ఎనిమిది రేట్లు, డబుల్‌ డిజిట్‌ కలిస్తే వంద రేట్లు డబ్బులు చెల్లిస్తామని నమ్మించి మోసం చేస్తారన్నారు. ఈ మోజులో పడి పేదలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నట్లు పోలీసులు తెలిపారు. మట్కా నిర్వాహకులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇందులో పదే పదే పట్టుబడితే కఠిన చర్యలు అనూహ్య రీతిలో ఉంటాయన్నారు. మట్కా ముఠాల గురించి మరింత సమాచారం కోసం పూర్తి స్థాయి విచారణ చేపట్టారు

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Ananthapur police nabbed six persons on charges of gambling while they were conducting the matka game and seized 4kgs of ganja and Rs. 20 lakhs from them.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి