ఏపీలో మరోసారి భారీగా తగ్గిన కరోనా కేసులు: ఆ 2 జిల్లాలో కేసుల్లేవ్, వెయ్యి దిగువకు యాక్టివ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. ఒక్క రోజు వ్యవధిలో 22,094 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 62 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,88,485కు చేరింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
Recommended Video

ఏపీలో వెయ్యి దిగువకు యాక్టివ్ కేసులు
గత 24 గంటల వ్యవధిలో కరోనాతో చికిత్స పొందుతూ విశాఖపట్నంలో ఒకరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాతో మరణించినవారి సంఖ్య 7160కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 102 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 8,80,36కు చేరింది. ప్రస్తుతం ఏపీలో యాక్టివ్ కేసుల సంఖ్య 962కు తగ్గింది.

ఏపీలో జిల్లాలవారీగా కరోనా కేసులు
ఏపీలో జిల్లాల వారీగా కరోనా కొత్త కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 1, చిత్తూరులో 8, తూర్పుగోదావరిలో 8, గుంటూరులో 7, కడపలో 9, కృష్ణాలో 10, కర్నూలులో 5, నెల్లూరులో 6, ప్రకాశంలో 1, శ్రీకాకుళంలో 2, విశాఖపట్నంలో 5 కరోనా కేసులు నమోదుయ్యాయి. ఇక విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.

దేశంలో భారీగా క్షీణించిన మరణాలు
మరోవైపు దేశంలోనూ కరోనా కేసులు, మరణాలు భారీగా తగ్గాయి. గత 24 గంటల్లో 5,32,236 నమూనాలను పరీక్షించగా.. 11,831 కరోనా కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,08,38,194కు చేరింది. ఆదివారం ఒక్కరోజులో 84 మరణాలు సంభవించాయి. ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 1,55,080కి చేరింది. ఒక్క రోజు వ్యవధిలో 11,904 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారి నుంచి 1,05,34,505 మంది సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం దేశంలో 1,48,606 యాక్టివ్ కేసులున్నాయి. ఇక దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా వేగంగా జరుగుతోంది. ఇప్పటి వరకు 58,12,362 మంది కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇప్పుడు కరోనా ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు టీకాలు వేస్తున్నారు.












Click it and Unblock the Notifications