ఏపీలో తగ్గుతున్న కరోనా: ఆ ఒక్క జిల్లాలోనే లక్ష దాటిన కేసులు, క్షీణించిన యాక్టివ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. కరోనా పరీక్షలు భారీ సంఖ్యలో చేస్తున్నప్పటికీ.. కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య మాత్రం తక్కువగానే ఉంటున్నాయి. గత పది రోజులుగా ఏపీలో కొత్త కరోనా కేసులు, మరణాలసంఖ్య కూడా క్రమంగా తగ్గుతూనే ఉంది. కోలుకుంటున్నవారి సంఖ్య మాత్రం పెరుగుతోంది.

ఏపీలో కొత్తగా 6242 కేసులు.. 40 మంది మృతి
తాజాగా, ఒక్క రోజు వ్యధిలో 72,811 కరోనా పరీక్షలు నిర్వహించగా 6242 మందికి కరోనా ఉన్నట్లు తేలింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,19,256కు చేరింది. గత 24 గంటల్లో 40 మంది కరోనాతో మరణించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మరణించినవారి సంఖ్య 5981కి చేరింది.

ఏపీలో జిల్లాల వారీగా కేసులు
జిల్లాల వారీగా మరణాల వారి సంఖ్యను గమనించినట్లయితే.. కృష్ణా జిల్లాలో ఆరుగురు, అనంతపురం, చిత్తూరులో ఐదుగురు చొప్పున, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో నలుగురు చొప్పున, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో ముగ్గురు చొప్పున, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఇద్దరు చొప్పున, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించారు.

ఏపీలో జిల్లాల వారీగా కొత్త కేసులు.. ఆ ఒక్క జిల్లాలోనే..
ఇక జిల్లాల వారీగా కొత్త కేసులను గమనించినట్లయితే..
అనంతపురంలో 411, చిత్తూరులో 863, తూర్పుగోదావరి 826, గుంటూరులో 562,
కడపలో 408, కృష్ణాలో 469, కర్నూలులో 220, నెల్లూరులో 413, ప్రకాశంలో 582,
శ్రీకాకుళంలో 192, విశాఖపట్నంలో 222, విజయనగరంలో 221, పశ్చిమగోదావరిలో 853 కేసులు నమోదయ్యాయి. కాగా, ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే లక్ష పాజిటివ్ కేసులు దాటడం గమనార్హం. ఈ జిల్లాలో 1,00,785 కేసులున్నాయి.

కరోనా నుంచి అత్యధికంగా కోలుకుంటుండటంతో..
గత 24 గంటల్లో 7084 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు 6,55,980 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 54,400 యాక్టివ్ కేసులున్నాయి. రాస్ట్రంలో ఇప్పటి వరకు 60,94,206 కరోనా పరీక్షలను నిర్వహించడం జరిగింది. దేశ వ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులున్న రాష్ట్రాల జాబితాలో రెండో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్.. యాక్టివ్ కేసులు అత్యధికంగా ఉన్న జాబితాలో మాత్రం నాల్గవ స్థానంలో ఉంది.












Click it and Unblock the Notifications