చాక్లెట్ చూపి, ఆరేళ్ల బాలికపై 64ఏళ్ల వృద్ధుడు ఘోరం
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో దారుణం వెలుగు చూసింది. జిల్లాలోని కంభంపాడు మండలంలో ఓ 64 ఏళ్ల వృద్ధుడు ఆరేళ్ల బాలిక పైన అత్యాచారానికి యత్నించడంతో పాటు, హత్యాయత్నం చేశాడు. బాలిక ఆడుకుంటుండగా చాక్లెట్లు ఇస్తానని చెప్పి ఆ వృద్ధుడు ఇంట్లోకి తీసుకు వెళ్లాడు.
అక్కడ ఆ బాలిక పైన అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అక్కడి నుండి ఆ బాలిక బయటకు పరుగెత్తుకు వచ్చింది. అయితే ఈ విషయం పెద్దవారికి చెబుతుందేమోననే ఆందోళనతో ఆ వృద్ధుడు ఆమెను పట్టుకొని హత్యాయత్నం చేయబోయాడు.
వెంటనే ఆ బాలిక పెద్దగా కేకలు వేసింది. అక్కడకు వచ్చిన స్థానికులు వృద్ధుడిని చితకబాది, పోలీసులకు అప్పగించారు.
బాలికపై అత్యాచార యత్నం

సత్యవేడు పట్టణంలోను ఇలాంటి సంఘటన జరిగింది. పట్టణంలోని గాంధీ విగ్రహం కూడలిలో నివాసం ఉంటున్న ఓ పాప ఆడుకుంటూ రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఇంటి పక్కనే ఉన్న ఫ్యాన్సీ షాపునకు వెళ్లింది. అక్కడ ఆమెకు షాపు యజమాని నాగరాజు (30) చాక్లెట్ ఇచ్చి తింటున్న సమయంలో పైశాచికంగా ప్రవర్తించాడు.
అనంతరం ఇంటికి వచ్చిన పాప కొంతసేపటికి నొప్పులుగా ఉన్నాయంటూ తల్లికి జరిగిన సంఘటన వివరించడంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు రాత్రి 11 గంటల సమయంలో అతనిపై దాడిచేశారు. అయితే బుధవారం ఉదయం ఈ సంఘటన పై స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
చర్చి ఫాదర్‌పై లైంగిక వేధింపుల కేసు
బిషప్ గాడెల్లి పరిశుద్ధ బాబు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వస్తున్న ఆరోపణలు క్రైస్తవ మిషనరీల్లో కలకలం సృష్టిస్తున్నాయి.
కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నం శివారు విశ్వబ్రాహ్మణ కాలనీలో పరిశుద్ధబాబు నిర్వహిస్తున్న ఒక వసతిగృహంలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ బాలిక తనపై పరిశుద్ధబాబు అత్యాచారయత్నానికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. అతనిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు పెట్టారు. గతంలోను అతని పైన ఇలాంటి ఆరోపణలు వచ్చాయని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications