ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు.. భారీగా పెరిగిన రికవరీ: యాక్టివ్ కేసుల తగ్గుముఖం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. కరోనా పరీక్షల సంఖ్య తగ్గించకపోయినప్పటికీ.. కొత్త పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం తగ్గుతోంది. అంతేగాక, నమోదవుతున్న కరోనా కొత్త కేసుల కంటే కూడా కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతుండటం గమనార్హం.

ఏపీలో కొత్తగా 6555 కేసులు, 31 మంది మృతి

ఏపీలో కొత్తగా 6555 కేసులు, 31 మంది మృతి


తాజాగా, గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 6555 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 31 మంది కరోనా బారినపడి మరణించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,06,790కి చేరింది. ఇప్పటి వరకు 5900 మంది మృతి చెందారు.

జిల్లాలవారీగా కొత్త మరణాలు

జిల్లాలవారీగా కొత్త మరణాలు

కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో కృష్ణా జిల్లాలో ఆరుగురు, అనంతపురం, తూర్పుగోదావరిలో నలుగురు, చిత్తూరు, కర్నూలు, విశాఖలో ముగ్గురు చొప్పున, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరిలో ఇద్దరు చొప్పున, కడప, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.

ఏపీలో జిల్లాల వారీగా కొత్త కేసులు

ఏపీలో జిల్లాల వారీగా కొత్త కేసులు

ఇక జిల్లాలవారీగా కొత్త కరోనా కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 333,
చిత్తూరులో 925, తూర్పుగోదావరిలో 975, గుంటూరులో 451, కడపలో 339,
కృష్ణాలో 473, కర్నూలులో 204, నెల్లూరులో 486, ప్రకాశంలో 668, శ్రీకాకుళంలో 223,
విశాఖపట్నంలో 297, విజయనగరంలో 251, పశ్చిమ గోదావరిలో 930 కేసులు నమోదయ్యాయి.

భారీగా పెరిగిన రికవరీ..

భారీగా పెరిగిన రికవరీ..

గత 24 గంటల్లో 70,399 మంది నమూనాలను పరీక్షించారు. కొత్తగా 7485 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా నుంచి ఇప్పటి వరకు 6,43,993 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 56,897 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 59,48,534 పరీక్షలు నిర్వహించారు. ఏపీలో క్రమంగా కొత్తగా నమోదువుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతుండగా.. కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతుండటం గమనార్హం. ఈ క్రమంలో ఏపీ కరోనా నుంచి త్వరలోనే కోలుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో ఉన్నప్పటికీ.. యాక్టివ్ కేసుల్లో మాత్రం నాలుగో స్థానంలో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+