ఏపీలో భారీగా పడిపోయిన కరోనా కేసులు: రికవరీ డబుల్, లక్షకు దిగిన యాక్టివ్ కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ ఉధృతి క్రమంగా తగ్గుతోంది. గత 24 గంటల్లో 8వేలకు దిగవనే కొత్త కేసులు నమోదయ్యాయి. అంతేగాక, కరోనా మహమ్మారితో మరణించినవారి సంఖ్య కూడా 80కి దిగువనే ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 89,732 నమూనాలను పరీక్షించగా.. 7796 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం సాయంత్రం వెల్లడించింది.

Recommended Video

    Coronavirus In India: కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో భారీగా తగ్గుదల !
    ఏపీలో కొత్తగా 7796 కరోనా కేసులు, 77 మరణాలు

    ఏపీలో కొత్తగా 7796 కరోనా కేసులు, 77 మరణాలు

    తాజాగా నమోదైన 7796 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,71,007కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 77 మంది మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో అధికంగా 12 మంది, పశ్చిమగోదావరి జిల్లాలో 10 మంది, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో 8 మంది చొప్పున, శ్రీకాకుళంలో ఏడుగురు, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో ఆరుగురు చొప్పున, విజయనగరంలో ఐదుగురు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో నలుగురు చొప్పున, కర్నూలులో ముగ్గురు, కడపలో ఇద్దరు, కృష్టాలో ఇద్దరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 11,629కు చేరింది.

    ఏపీలో రికవరీలు పెరగడంతో తగ్గుతున్న యాక్టివ్ కేసులు

    ఏపీలో రికవరీలు పెరగడంతో తగ్గుతున్న యాక్టివ్ కేసులు


    ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 14,641 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 16,51,790కి చేరింది. రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం 1,07,588 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,99,46,253 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1302 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అల్పంగా కర్నూలులో 147 మంది కరోనా బారినపడ్డారు.

    ఏపీలో జిల్లాల వారీగా కరోనా కొత్త కేసులు

    ఏపీలో జిల్లాల వారీగా కరోనా కొత్త కేసులు


    ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 918, చిత్తూరులో 1210, తూర్పుగోదావరిలో 1302, గుంటూరులో 518, కడపలో 410, కృష్ణాలో 379, కర్నూలులో 147, నెల్లూరులో 311, ప్రకాశంలో 499, శ్రీకాకుళంలో 376, విశాఖపట్నంలో 672, విజయనగరంలో 299, పశ్చిమగోదావరిలో 755 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏపీ సర్కారు కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూను అమలు చేస్తోంది. ఆంక్షలను మరోసారి పొడిగించిన విషయం తెలిసిందే.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+