ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం... ఏడుగురు మృతి... నలుగురి పరిస్థితి విషమం..
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగ్గయ్యపేట మండలం వేదాద్రి సమీపంలో ట్రాక్టర్-లారీ ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు సమాచారం.
మృతులను ఖమ్మం జిల్లా మధిర వాసులుగా గుర్తించారు. మధిర మండలంలోని గోపవరం నుంచి 25 మంది గ్రామస్తులు ట్రాక్టర్‌లో దైవ దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. సమాచారం అందగానే పోలీసులు అక్కడికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.













Click it and Unblock the Notifications