మిస్టరీ వీడింది: టీడీపీ మాజీ కార్పోరేటర్ ను హత్య చేసింది వారే..
త్యవతి నిద్రపోయాక తలుపు తెరిచి వారిని లోపలికి ఆహ్వానించాడు. అనంతరం ఆమెను హత్య చేసి ఒంటిపై ఉన్న బంగారంతో ఉడాయించారు.
విశాఖపట్నం: నగరంలోని అల్లిపురంలో హత్యకు గురైన టీడీపీ మాజీ కార్పోరేటర్ సత్యవతి హత్య కేసులో నిందితులెవరో తేలిపోయింది. సత్యవతి ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా పోలీసులు నిర్దారించారు.
ఘటనకు సంబంధించి ఇద్దరు మైనర్లతో సహా మొత్తం నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మీడియాకు వివరాలు వెల్లడించారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మాజీ కార్పోరేటర్ సత్యవతి అల్లిపురంలోని మూడంతస్తుల సొంత భవనంలో నివాసం ఉంటోంది. భవనంలోని సెకండ్ ఫ్లోర్ లో ఓ కూలీ కుటుంబం అద్దెకు ఉంటుంది. పెళ్లయిన కొద్దిరోజులకే సత్యవతి తన భర్తను కోల్పోవడంతో అప్పటినుంచి ఒంటరిగానే ఉంటున్నట్లు తెలుస్తోంది.

దీంతో సత్యవతి ఆస్తులపై సదరు అద్దె కుటుంబం కన్ను పడింది. సత్యవతిని హత్య చేస్తే ఆస్తి దక్కించుకోవచ్చని కుట్ర పన్నారు. ఇందుకోసం మైనర్ అయిన తమ కొడుకును అడ్డంపెట్టుకుని ఆ కుటుంబం ఓ ప్లాన్ వేసింది.
వృద్దురాలు కావడంతో రాత్రుళ్లు తనకు తోడుగా సత్యవతి చుట్టుపక్కల వారిని పిలిపించుకునేది. హత్య జరిగిన రోజు రెండో అంతస్తులో అద్దెకు ఉంటున్న కుటుంబం సత్యవతికి తోడుగా తమ కుటుంబాన్ని పంపించింది.
అంతకుముందే అతనికి తమ ప్లాన్ గురించి తల్లిదండ్రులు వివరించారు. దీంతో సత్యవతి నిద్రపోయాక తలుపు తెరిచి వారిని లోపలికి ఆహ్వానించాడు. అనంతరం ఆమెను హత్య చేసి ఒంటిపై ఉన్న బంగారంతో ఉడాయించారు. పోలీసులకు వారిని పట్టుకున్న తర్వాత 9తులాల బంగారం, రూ.10,500నగదు స్వాధీనం చేసుకున్నారు.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications