తిరుమలలో చిన్నపాటి సమస్యలు వస్తుంటాయ్- అధిగమిస్తాం: టీటీడీ
Tirumala: దేశ 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు న్యూఢిల్లీలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. కర్తవ్యపథ్‌లో కోలాహలం నెలకొంది. కొద్దిసేపటి కిందటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఎగుర వేశారు.స్వర్ణిమ్ భారత్- విరాసత్ ఔర్ వికాస్ అనే థీమ్‌తో ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలు కట్టిపడేశాయి.
గణతంత్రి దినోత్సవ వేడుకలు తిరుమలలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గోకులం విశ్రాంతి భవనం ప్రాంగణంలో తిరుమల తిరుపతి అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ప్రసంగించారు. టీటీడీ అమలు చేస్తోన్న వివిధ ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటోన్నామని అన్నారు.

శ్రీవారి సేవకుల సహాయంతో తిరుమలకు వచ్చే లక్షలాది మంది భక్తుల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తోన్నామని, వాళ్లు ఇచ్చిన సూచనలు, సలహాల మేరకు మరింత సౌకర్యవంతమైన దర్శనం, ఇతర వసతులను పారదర్శకంగా కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వెంకయ్య చౌదరి అన్నారు.
ప్రపంచం నలుమూలల నుండి శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు టీటీడీ ఉద్యోగులు సమష్టి కృషితో పని చేసి మరింత మెరుగైన సేవలను అందించాలని పిలుపునిచ్చారు. గత ఏడాది అక్టోబరులో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా నిర్వహించామని వివరించారు. భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాదాలు, క్యూలైన్ల నిర్వహణ మార్పులు చేశామని పేర్కొన్నారు.
భక్తులకు మరింత నాణ్యమైన అన్నప్రసాదాలు అందించేందుకు అత్యాధునిక యంత్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెంకయ్య చౌదరి తెలిపారు. జనవరి 10 నుండి 19వ తేదీ వరకు 6.80 లక్షల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నట్లు చెప్పారు. దాదాపు 96 శాతం మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు చాలా బాగున్నాయని సంతృప్తిని వ్యక్తం చేశారని అన్నారు.
తిరుమలలో వసతి గదుల కేటాయింపులో ఉన్న సమస్యలు పరిష్కరించి, మరి కొన్ని కాటేజిలో మరమ్మతులు త్వరగా పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు సీహెచ్ వెంకయ్య చౌదరి చెప్పారు. తిరుమలలో అన్నదానం, పారిశుద్ధ్యం, విద్యుత్ శాఖ, ఉద్యానవన శాఖ వంటి విభాగాలు బాగా పని చేస్తున్నాయని ప్రశంసించారు.

టీటీడీ ఐటి విభాగాన్ని బలోపేతం చేసేలా చర్యలు తీసుకొని భక్తులకు సులభతరంగా సేవలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. టీటీడీ ఇటీవల ప్రవేశపెట్టిన ఈ-హుండీ విధానం మంచి ఫలితాలు ఇస్తోందని పేర్కొన్నారు. తిరుమలలో పలుచోట్ల ఏర్పాటు చేసిన కియోస్క్‌లల్లో యుపీఐ ద్వారా భక్తులు సులభతరంగా విరాళాలు అందిస్తున్నారని చెప్పారు.
నిత్యం తిరుమలకు విచ్చేసే కోట్లాదిమంది భక్తులకు కొన్ని సమయాల్లో అందిస్తున్న సౌకర్యాలలో చిన్నపాటి సమస్యలు వస్తుంటాయని వెంకయ్య చౌదరి పేర్కొన్నారు. అట్లాంటి వాటిని కూడా అధిగమించి భక్తులకు సౌకర్యవంతమైన సేవలు కల్పించడంలో టీటీడీ అహర్నిశలు కృషి చేస్తుందని అన్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications