ఏపీలో కరోనా: లక్షా 70వేల చేరువలో పాజిటివ్ కేసులు, కొత్తగా 63 మరణాలు, జిల్లాల్లో కేసులు ఇలా

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా పరీక్షల సంఖ్య పెంచుతున్న కొద్దీ పాజిటివ్ కేసులు కూడా పెరుగుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 7822 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

కొత్తగా 7822 కరోనా కేసులు..

కొత్తగా 7822 కరోనా కేసులు..

తాజాగా నమోదైన 7822 కరోనా పాజిటివ్ కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,66,586కి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ సోమవారం విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది. ఇప్పటి వరకు 21,10,923 కరోనా పరీక్షలు నిర్వహించగా, ఒక్క రోజులో 45,516 పరీక్షలు చేసినట్లు వెల్లడించింది.

కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య పెరుగుతోంది..

కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య పెరుగుతోంది..

తాజా కేసుల్లో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1113 కేసులు, విశాఖపట్నంలో 1049 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 76,377 యాక్టివ్ కేసులున్నాయి. 88,672 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఒక్కరోజులోనే 5786 మంది కోలుకున్నట్లు తెలిపింది.

జిల్లాల వారీగా మృతుల వివరాలు..

జిల్లాల వారీగా మృతుల వివరాలు..

తాజాగా 63 మంది మృతి చెందడంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 1537కి చేరింది. పశ్చిమగోదావరి జిల్లాలో 11 మది, విశాఖపట్నంలో 9 మంది, ప్రకాశం జిల్లాలో 8 మంది, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాలో ఏడుగురు చొప్పున, విజయనగరంలో నలుగురు, చిత్తూరు, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో ముగ్గురు చొప్పున, అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, కడప జిల్లాల్లో ఇద్దరు చొప్పున కరోనాతో మృత్యువాతపడ్డారు.

Recommended Video

    #AmitabhBachchan : కరోనా నుంచి కోలుకున్న Amitabh Bachchan! || Oneindia Telugu
    కొత్తగా నమోదైన కేసులు జిల్లాల్లో ఇలా..

    కొత్తగా నమోదైన కేసులు జిల్లాల్లో ఇలా..

    తాజాగా నమోదైన కేసుల్లో జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అనంతపురంలో 953, చిత్తూరులో 240, తూర్పుగోదావరిలో 1113, గుంటూరులో 573, కడపలో 576, కృష్ణాలో240, కర్నూలులో 602, నెల్లూరులో 500, ప్రకాశంలో 364, శ్రీకాకుళంలో 495, విశాఖపట్నంలో 1049, విజయనగరంలో 677, పశ్చిమగోదావరిలో 440 కరనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు అత్యధికంగా నమోదైన రాష్ట్రాల జాబితాలో మూడో స్థానంలో ఉంది. మహారాష్ట్ర, తమిళనాడు తర్వాత ఏపీ మూడో స్థానంలో కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 18,30,949 కరోనా కేసులు నమోదు కాగా, 5,85,259 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో ఇప్పటి వరకు

    12,06,769 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 38,485 మంది కరోనా బారినపడి మరణించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+