ప్రయాణీకుల పైకి దూసుకెళ్లిన బస్, 8మందికి గాయాలు
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఓ బస్సు ప్రయాణీకుల పైకి దూసుకెళ్లడంతో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. సికింద్రాబాదులోని రెతిఫైల్ బస్ స్టాపులో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఉప్పల్ నుంచి మేడ్చల్‌కు వెళ్తున్న ఆర్టీసి బస్సు సికింద్రాబాదు రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో అదుపు తప్పింది.
ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న రామంతాపూర్‌కు చెందిన వేణు, నల్గొండ జిల్లా బీబీనగర్‌కు చెందిన శ్రీనివాస్‌లతో పాటు మరో ఆరుగురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని స్థానిక ప్రయివేటు, గాంధీ ఆసుపత్రులలో చేర్పించారు. డ్రైవర్ అహ్మద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.

బస్సు, ట్రాక్టర్ ఢీ
కర్నూలు జిల్లాలో బస్సు, ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు పిల్లలకు గాయాలయ్యాయి. జిల్లాలోని ఎమ్మిగనూరులో ఈ ఘటన జరిగింది. బస్సు డ్రైవర్ అప్రమత్తతో ప్రమాదం తప్పింది. ట్రాక్టర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.
బొమ్మల గోదాంలో అగ్ని ప్రమాదం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని చిన్న బజారులోని ఓ బొమ్మల గోదాంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్ని మాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications