వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ మండలిలో 8 ఎమ్మెల్సీలు ఖాళీ-అయినా ఎన్నికల్లేవ్‌-వైసీపీకి పరిషత్ దెబ్బ

|
Google Oneindia TeluguNews

ఏపీ శాసనమండలిలో స్ధానిక సంస్ధల కోటా కింద గతంలో ఎన్నికైన 8 మంది ఎమ్మెల్సీలు ఇవాళ పదవీ విరమణ చేస్తున్నారు. ఇందులో ఏడుగురు టీడీపీ సభ్యులు కాగా.. ఒకరు వైసీపీ సభ్యుడు. వీరితో పాటు గతంలో ఖాళీ అయిన మరో ముగ్గురు ఎమ్మెల్సీల్ని కలుపుకుని మొత్తం 11 స్ధానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే ఈ ఎన్నికలు వెంటనే జరిగే అవకాశాలు లేవు. ఇందుకు కారణం ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రద్దు కావడమే. ఈ ఎన్నికలు జరిగే వరకూ ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించే పరిస్ధితి లేదు.

 ఏపీ మండలిలో మరో 8 సీట్లు ఖాళీ

ఏపీ మండలిలో మరో 8 సీట్లు ఖాళీ

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శాసనమండలిలో ఆ పార్టీ బలం పెంచుకుంటూ వస్తోంది. అదే సమయంలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వివిధ కోటాల కింద ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వారు ఒక్కొక్కరుగా పదవీ విరమణ చేస్తూ వస్తున్నారు. దీంతో సహజంగానే టీడీపీ బలం తగ్గుతుండగా.. ఆ మేరకు వైసీపీ బలం పెరుగుతోంది. తాజాగా ఇవాళ మరో 8 మంది ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేయబోతున్నారు. వీరిలో అత్యధికులు టీడీపీ వారే. వీరి స్ధానాల్లో తిరిగి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.

 టీడీపీకి 7 మైనస్‌, వైసీపీకి ఒకటి

టీడీపీకి 7 మైనస్‌, వైసీపీకి ఒకటి

ఇవాళ ఏపీ శాసనమండలిలో ఖాళీ అవుతున్న 8 ఎమ్మెల్సీ సీట్లలో ఏడుగురు టీడీపీ సభ్యులే. మరొకరు వైసీపీ సభ్యుడు. టీడీపీ నుంచి

రెడ్డి సుబ్రమణ్యం,
వైవీబీ, బుద్దా వెంకన్న, పప్పల చలపతి రావు, గాలి సరస్వతి, ద్వారపు రెడ్డి జగదీశ్వరరావు, బుద్దా నాగ జగదీశ్వరరావు ఇవాళ రిటైర్ అవుతున్నారు. వైసీపీ నుంచి పార్టీ ఛీఫ్‌ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు రిటైర్ అవుతున్నారు. అయితే ఈ స్ధానాలన్నీ వైసీపీ ఏకపక్షంగా గెల్చుకునే అవకాశాలున్నాయి. కానీ అక్కడే ఓ ట్విస్ట్‌ ఎదురవుతోంది.

 మండలిలో వైసీపీ-టీడీపీ 21-15

మండలిలో వైసీపీ-టీడీపీ 21-15

శాసనమండలిలో ఇవాళ 8 మంది ఎమ్మెల్సీల రిటైర్మెంట్‌ తర్వాత వైసీపీ, టీడీపీల బలాబలాల్లో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చే నాటికి కేవలం 8 మంది ఎమ్మెల్సీలతో బలహీనంగా ఉంది. కానీ ఇప్పుడు తాజా మార్పుల తర్వాత వైసీపీ బలం 21కి, టీడీపీ బలం 15కి చేరనున్నాయి. తాజా ఎమ్మెల్సీల రిటైర్మెంట్‌ తర్వాత తిరిగి ఎన్నికలు జరగకపోయినా వైసీపీ.. విపక్ష టీడీపీ కంటే ఆరు సీట్ల ఆధిక్యంలోనే ఉంది. దీంతో వైసీపీకి ఇకపై మండలిలో ప్రభుత్వ బిల్లులు నెగ్గించుకోవడం సులువవుతుంది.

 ఎమ్మెల్సీ ఎన్నికలపై పరిషత్‌ పోరు దెబ్బ

ఎమ్మెల్సీ ఎన్నికలపై పరిషత్‌ పోరు దెబ్బ

ఏపీలో ఇవాళ ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీలంతా స్ధానిక సంస్ధల కోటా కింద ఎన్నికైన వారే. అంటే మున్సిపాలిటీలతో పాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు ఎన్నుకున్న వారు. ఇప్పుడు వీరి స్ధానంలో కొత్తగా ఎమ్మెల్సీల్ని ఎన్నికోవాలంటే ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు కూడా అవసరం. కానీ ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిగితే కానీ కొత్త సభ్యుల ఎన్నిక జరగదు. కాబట్టి అప్పటివరకూ ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. ప్రస్తుతం కరోనా పరిస్ధితుల్లో ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు వైసీపీ సర్కార్ మొగ్గుచూపే అవకాశం లేదు. అంటే కరోనా తగ్గే వరకూ అటు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కానీ, ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ జరిగే అవకాశం లేదు.

English summary
8 mlc seats to be vacant in andhrapradesh legislative council today. but due to high court verdict on cancellation of mptc and zptc elections, the polls will not be conducted immediately.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X