శ్రీసత్యసాయి జిల్లాలో ఘోరం - 8 మంది సజీవ దహనం : ఆటోపై హైటెన్షన్ వైర్లు..!!
శ్రీసత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోపై హైటెన్షన్ వైర్లు తెగిపడటంతో ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు. దీంతో కూలీలతో వెళ్తున్న ఆటో మంటల్లో కాలి బూడిదయ్యింది. 10 మంది అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లిలో గురువారం ఉదయం వ్యవసాయ పనుల కోసం వీరంతా ఆటోలో వెళ్తున్న సమయంలో ఈ విషాదం చోటు చేసుకుంది. హైటెన్షన్ కరెంట్ తీగలు తెగిపడిపోయాయి.
దీంతో, ఒక‍్కసారిగా మంటలు చెలరేగాయి. మృతి చెందిన వారిని గుడ్డంపల్లి వాసులుగా గుర్తించారు. బత్తాయి తోటలో చెట్ల వద్ద కలుపు తీయడానికి ఈ కూలీలు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా చెబుతున్నారు. లక్ష్మీ అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలు అయిన వారిని బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆటో డ్రైవర్ పోతులయ్య ప్రమాదం నుంచి బయట పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సజీవ దహనం అయిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా చెబుతున్నారు.

Recommended Video

ప్రమాద సమయంలో ఆటో డ్రైవర్ తో సహా పది మంది ఉన్నట్లుగా తెలుస్తోంది. డ్రైవర్ తో పాటుగా ఒక మహిళ ప్రాణాలతో బయట పడతంతో.. మిగిలిన ఎనిమిది మంది మరణించారు. జిల్లాలోగాయపడిన వారికి మెరుగైన వైద్యం చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా అధికారులు వెంటనే ఘటనా స్థలికి బయల్దేరారు.












Click it and Unblock the Notifications