YS Sharmila Health: వైఎస్ షర్మిలకు సర్జరీ- హెల్త్ అప్డేట్ ఇదే..!

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (ys Sharmila)కు తాజాగా శస్త్రచికిత్స జరిగింది. తనకు కడుపులో శస్త్రచికిత్స (Abdominal Surgery) జరిగినట్లు ఆమే స్వయంగా ఇవాళ ట్వీట్ చేశారు. అంతే కాదు ప్రస్తుతం తాను కోలుకుంటున్నట్లు కూడా అందులో పేర్కొన్నారు. ఈ ట్వీట్ కు జతగా తాను ఆస్పత్రి బెడ్ పై ఉన్న ఫొటోను కూడా ఆమె షేర్ చేశారు. దీంతో పాటు అభిమానులు ఆందోళన చెందకుండా ఓ సందేశం కూడా ఇచ్చారు.

"ఇటీవల నాకు జరిగిన అవసరమైన ఉదర శస్త్రచికిత్స (abdominal surgery) తర్వాత నేను బాగా కోలుకుంటున్నానని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. నా పట్ల శ్రద్ధ చూపిన మరియు మద్దతునిచ్చిన శ్రేయోభిలాషులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు." అంటూ వైఎస్ షర్మిల ట్వీట్ లో పేర్కొన్నారు. దీంతో వైఎస్ షర్మిల అభిమానులు , కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊపిరిపీల్చుకుంటున్నారు.

YS Sharmila Recovering Well Following Abdominal Surgery Expresses Gratitude to Supporters

వైఎస్ షర్మిల సర్జరీ విషయాన్ని మాత్రం ఎందుకో గోప్యంగా ఉంచారు. సర్జరీ ఎప్పుడు జరిగిందనే విషయాన్ని ఇప్పటివరకూ వెల్లడించలేదు. ఎక్కడ జరిగిందనే విషయాన్ని కూడా చెప్పలేదు. అలాగే ఇప్పటికీ ఆ వివరాలను షర్మిల కూడా బయటపెట్టలేదు. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ స్ధాయిలో నీట్ విద్యార్ధులకు మద్దతుగా నిరసనలు చేపడుతోంది. రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ యూనిట్లు ఆందోళనల్లో బిజీగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో షర్మిల కనిపించకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి సమయంలో షర్మిల ఈ విషయం బయటపెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+