37 రోజుల తర్వాత కంటి నిండా నిద్రపోయా- అభిజిత్ డిప్కే లేటెస్ట్ వీడియో: తాజా హెచ్చరిక

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ల లీకేజీ వివాదానికి ఎట్టకేలకు శుభం కార్డు పడింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయడంతో.. గత కొన్ని రోజులుగా దేశ రాజధాని వేదికగా సాగుతున్న విద్యార్థుల ఉధృత నిరసనలు ముగిశాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆందోళనలను పూర్తిగా విరమిస్తున్నట్లు కాక్రోచ్ జనత పార్టీ ప్రకటించింది. ఇది దేశ యువత సాధించిన అత్యంత చారిత్రక విజయంగా అభివర్ణించింది.

ఈ పరిణామాల తర్వాత మొదటి రోజైన ఈ ఉదయం కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ డిప్కే తాజా వీడియోను షేర్ చేశారు. ఈ సుదీర్ఘ ఆందోళనల ముగింపుపై స్పందించారు. నిరసన ముగిసిన తర్వాతి రోజు తన అనుభవాలను పంచుకున్నారు. రోజుల తరబడి సాగిన తీవ్ర శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి తర్వాత, ఎట్టకేలకు తన బెడ్రూమ్ లో ప్రశాంతంగా కంటి నిండా కునుకు తీశానని, ఎంతో ప్రశాంతంగా నిద్ర లేచానని ఆనందం వ్యక్తం చేశారు.

Finally Able to Sleep in My Own Bedroom Abhijeet Dipke Reflects on Difficult Protest After 37 Days

జంతర్ మంతర్ వద్ద సాగిన ఈ 37 రోజుల నిరసన కార్యక్రమం అత్యంత కఠినంగా సాగిందని, ఈ సుదీర్ఘ పోరాటంలో తమకు ప్రతి క్షణం వెన్నుదన్నుగా నిలిచిన మద్దతుదారులకు, సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేశారు. ఢిల్లీలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య, తీవ్ర ఎండలను సైతం లెక్కచేయకుండా ఈ నిరసన దీక్షల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తోన్నానని చెప్పారు.

ఈ ఒక్క విజయంతోనే సంతృప్తి చెంది తాము ఆగిపోబోమని స్పష్టం చేశారు అభిజిత్ డిప్కే. ప్రస్తుతానికి జంతర్ మంతర్ వద్ద నిరసనలు ముగిసినప్పటికీ, తమ పోరాటం ఇక్కడితో ఆగిపోలేదని, కేంద్ర ప్రభుత్వం నుంచి కీలకమైన అంశాలపై స్పష్టమైన హామీలు లభించినందున ప్రస్తుతానికి మాత్రమే తమ ఆందోళనలను విరమించామని ఆయన పునరుద్ఘాటించారు. భవిష్యత్తులో యువత, విద్యార్థుల హక్కుల సాధన కోసం తమ పోరాటాన్ని మరింత ఉధృతంగా ముందుకు తీసుకువెళతామని, ఇదొక సుదీర్ఘ, నిరంతర ప్రక్రియ అని అభిజిత్ డిప్కే స్పష్టం చేశారు.

ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలును నిశితంగా పరిశీలిస్తామని, ఒకవేళ హామీల అమలులో నిర్లక్ష్యం వహిస్తే మళ్లీ వీధుల్లోకి వచ్చి పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని డిప్కే హెచ్చరించారు. రాబోయే రోజుల్లో తాము తీసుకోబోయే తదుపరి చర్యలు, నూతన వ్యూహాలను త్వరలోనే వివరంగా వెల్లడిస్తామని ఆ సంస్థ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+