ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కొత్త కేసులు: 10వేలకు తగ్గిన యాక్టివ్ కేసులు, జిల్లాలవారీగా
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. అయితే, ఒక్కోరోజు కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా, 900కి దిగువనే కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 50,304 నమూనాలను పరీక్షించగా.. 865 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శనివారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 865 కరోనా కేసులు, 09 మంది మృతి
తాజాగా నమోదైన 865 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,51,998కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 09 మంది మృతి చెందారు.
చిత్తూరు జిల్లా అత్యధికంగా ముగ్గురు మరణిచగా, గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 14,195కి పెరిగింది.

ఏపీలో 10,574 యాక్టివ్ కేసులు
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 1424 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 20,27,229కి చేరింది. కాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం 10,574 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,84,00,471 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 172 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాలో 4 కేసుల చొప్పున నమోదయ్యాయి.

ఏపీలో జిల్లాలవారీగా కరోనావైరస్ కొత్త కేసులు
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 07, చిత్తూరులో 168, తూర్పుగోదావరిలో 172, గుంటూరులో 117, కడపలో 23, కృష్ణాలో 75, కర్నూలులో 04, నెల్లూరులో 75, ప్రకాశంలో 90, శ్రీకాకుళంలో 04, విశాఖపట్నంలో 35, విజయనగరంలో 15, పశ్చిమగోదావరిలో 80 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,91,644, చిత్తూరులో 2,44,247 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకుపైగా ఉన్నాయి. ఒక్క విజయనగరం జిల్లాలోనే లక్షకు దిగువగా(82,778) కరోనా కేసులున్నాయి.

దేశంలో కొత్త కరోనా కేసులు
దేశంలో కరోనా వైరస్ కేసులు స్వల్పంగా తగ్గాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 14,29 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 24,354 మందికి కరోనావైరస్ సోకినట్లు తేలింది. నిన్నటితో పోల్చితే ఇది 8.8 శాతం(26,727) తక్కువగా కావడం గమనార్మం. కొత్త కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 3.38 కోట్ల చేరింది. శుక్రవారం 234 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో మరణించినవారి సంఖ్య 4,48,573కి చేరింది. శుక్రవారం 25,455 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 3.30కోట్లకుపై పెరిగింది. ప్రస్తుతం రికవరీ రేటు 97.86 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 2,73,889 యాక్టివ్ కేసులున్నాయి. పాజిటివిటీ రేటు 0.81 శాతానికి తగ్గింది. శుక్రవారంనాడు 69.33 లక్షల మంది కరోనా టీకా వేయించుకున్నారు. దీంతో ఇప్పటి వరకు టీకా తీసుకున్నవారి సంఖ్య 89.74 కోట్లకు చేరింది. మరోవైపు కేరళలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. శుక్రవారం కేరళలో దేశంలో సగానికిపైగా అంటే 13,834 కొత్త కేసులు నమోదు కాగా, 95 మరణాలు సంభవించాయి.












Click it and Unblock the Notifications