ఏపీలో కరోనా: కొత్త కేసుల కంటే ఎక్కువే కోలుకున్నారు, జిల్లాల వారీగా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత రెండు మూడు రోజులుగా 10వేల కంటే తక్కువగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అదేవిధంగా కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది. గత 24 గంటల్లో కూడా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కంటే ఎక్కువగానే కోలువడం మంచి విషయం.

ఏపీలో 8846 కొత్త కేసులు.. 69 మంది మృతి
ఒక్కరోజులో 70,511 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 8846 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయనిట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,83,925కు చేరింది. గత 24 గంటల్లో 69 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5041కి చేరింది.

జిల్లాల వారీగా మరణాలు ఇలా..
ఇక జిల్లాల వారీగా ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 10 మంది మరణించగా, చిత్తూరులో 9 మంది, అనంతపురం, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఆరుగురు చొప్పున, కడప, విశాఖపట్నం జిల్లాల్లో ఐదుగురు చొప్పున, గుంటూరు, నెల్లూరు, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఐదుగురు చొప్పున, , కర్నూలు జిల్లాలో ముగ్గురు, శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురు మరణించారు.

జిల్లాల వారీగా కొత్త కేసులు..
జిల్లాల వారీగా కొత్త కేసులను గమనించినట్లయితే.. అత్యధిక కేసులు తూర్పుగోదావరి జిల్లాలో నమోదయ్యాయి. అనంతపురంలో 299, చిత్తూరులో 572,
తూర్పుగోదావరిలో 1423, గుంటూరులో 641, కడపలో 661, కృష్ణాలో 398, కర్నూలులో 314, నెల్లూరులో 820, ప్రకాశంలో 979, శ్రీకాకుళంలో 678, విశాఖపట్నంలో 574, విజయనగరంలో 532, పశ్చిమగోదావరి జిల్లాలో 955 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

కొత్త కేసులకంటే.. కోలుకున్నవారి సంఖ్యే ఎక్కువ..
ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 47,31,866 నమూనాలను పరీక్షించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 92,353 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో 9628 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 4,86,531కి చేరింది. దేశంలో అత్యధిక కేసులున్న రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర తర్వాత ఏపీని కొనసాగుతోంది. ఇక అత్యధిక యాక్టివ్ కేసులున్న రాష్ట్రాల జాబితాలో మూడో స్థానంలో ఉంది.












Click it and Unblock the Notifications