ప్రయాణికులకు తియ్యటి శుభవార్త చెప్పిన ఇండియన్ రైల్వే

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల మధ్య పరుగులు తీస్తున్న సూపర్ ఫాస్ట్, ఎక్స్ ప్రెస్ రైళ్లకు ప్రయాణికుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. రిజర్వేషన్ దొరకడం కష్టమైనప్పటికీ కిక్కిరిసి జనరల్ బోగీల్లో ప్రయాణిస్తుంటారు. ఈ రైళ్లకు జనరల్ బోగీలు కేవలం నామమాత్రంగా అధికారులు ఏర్పాటు చేస్తారు. ఏసీ బోగీలను ఏర్పాటు చేసి ఆదాయాన్ని రాబట్టుకోవడంపై ఉన్న దృష్టి జనరల్ బోగీల్లో ప్రయాణించేవారిపై మాత్రం ఉండదు. ఎందుకంటే వారంతా చాలా తక్కువలో టికెట్ కొనుగోలు చేసి జనరల్ బోగీల్లో ప్రయాణిస్తుంటారనే చిన్నచూపు రైల్వేకు ఉంది.

వారి ఇబ్బందులు తీర్చాల్సిన భారతీయ రైల్వే ఇప్పుడు కళ్లు తెరిచింది. ఇన్ని సంవత్సరాలుగా ఎన్ని విమర్శలు వస్తున్నప్పటికీ పట్టించుకోని అధికారులు ఇప్పుడు మాత్రం వారి సమస్యలను పరిష్కరిస్తామంటూ ముందుకు రావడం విశేషమని చెప్పొచ్చు. ముఖ్యమైన అన్ని రైళ్లకు అదనంగా రెండు జనరల్ బోగీలను ఏర్పాటు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 46 రైళ్లకు 92 బోగీలు అందుబాటులోకి రాబోతున్నాయి.అక్టోబరు 18వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రాబోతోంది. ప్రస్తుతం జనరల్ బోగీలు రెండు ఉంటాయి. ఇంజన్ తర్వాత ఒకటి, చివరలో ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఇంజన్ తర్వాత రెండు, చివరలో రెండు ఉండనున్నాయి. గతంలో రైళ్లు ఇలాగే ప్రయాణించేవి. రైల్వేకు ధనదాహం ఎక్కువ కావడంతో వీటిని తొలగించి స్లీపర్, ఏసీ బోగీలను ఏర్పాటు చేసింది.

92 general bogies available for 46 trains across the country

ఏయే రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేస్తున్నారంటే

కాకినాడ పోర్ట్ - లింగంపల్లి గౌతమి (12737/12738 ),
కాకినాడ పోర్ట్ - భావనగర్ (12755/12756 ),
సికింద్రాబాద్ - గూడూరు సింహపూరి (12709/12710 ),
సికింద్రాబాద్ - హౌరా ఫలక్‌నుమా (12703/12704),
హైదరాబాద్ - విశాఖపట్నం గోదావరి (12727),
కాకినాడ పోర్టు - సాయినగర్‌ షిర్డీ (17205/17206)

మచిలీపట్నం - యశ్వంత్‌పూర్‌ కొండవీడు (17211/17212),
మచిలీపట్నం - ధర్మవరం మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ (17215/17216),
కాకినాడ పోర్టు - లింగంపల్లి కోకనాడ (12775/12776 ),
సికింద్రాబాద్ - భువనేశ్వర్‌ విశాఖ (17015/17016),
హైదరాబాద్ - తాంబరం చార్మినార్ (12759/12760),
కాకినాడ పోర్టు - లోకమాన్య తిలక్‌ (17221/17222)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+