ప్రేమజంట ఆత్మహత్య, గర్ల్ నైన్త్ క్లాసే, అబ్బాయిది డిగ్రీ

నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం చేతన్‌నగర్ గ్రామంలో ఇరుగుపొరుగున ఉండే అనురాధ (15), జ్ఞానేశ్వర్ (20)లు ఆత్మహత్య చేసుకున్నారు. వారు ప్రేమించుకున్నారు. వారం కిందట కోటగిరికి వచ్చిన జ్ఞానేశ్వర్‌తో అనురాధ వెళ్లిపోయింది. ఆమె కనపడకపోడంతో తల్లిదండ్రులు బంధువుల ఇళ్లల్లో వెదికి, చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ విషయం తెలుసుకున్న ప్రేమజంట తాము ఇంటికి వెళితే చంపేస్తారన్న భయంతో మూడు రోజులుగా కామారెడ్డిలో తలదాచుకున్నారు. శుక్రవారం రాత్రి తామిద్దరం చనిపోవాలను కుంటున్నామని, తమ గురించి వెతకవద్దంటూ తన అన్న మనోహర్‌కు జ్ఞానేశ్వర్ మెసేజ్ పంపాడు. అనంతరం ఆ ప్రేమికులు కామారెడ్డిలోని అడ్డూర్ వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు.
ఆగిపోయిన పెళ్లి
పెళ్లి జరుగుతున్న సమయంలో మండపంపై విద్యుత్ తీగలు తెగిపడటంతో పెళ్లి ఆగిపోయింది. అనంతపురం జిల్లా ఆగిలి మండలం డొక్కంపల్లి లో ఈ రోజు ఉదయం ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో వధువు తల్లిదండ్రులతో పాటు మరో ఐదుగురు గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం మడకశిర ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications