విషాదం: బ్యాంకాక్‌లో స్విమ్మింగ్ ఫూల్‌లో పడి ఏపీ యువకుడు మృతి
హైదరాబాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు బ్యాంకాక్‌లో మృతి చెందారు. ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ ఫూల్‌లో పడటంతో కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
వెంకటేశ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో పనిచేస్తున్నాడు. బ్యాంకు పనినిమిత్తం ఇటీవలే అతను బ్యాంకాక్ వెళ్లాడు. ఈ ఘటనపై కుటుంబసభ్యులకు అక్కడి అధికారులు సమాచారమందించారు.

కొడుకు మరణవార్త విని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వెంకటేష్ మృతితో ఆయన కుటుంబంతోపాటు స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.












Click it and Unblock the Notifications