Vijayawada: అసిస్టెంట్ మేనేజర్ భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మేనేజర్..!
అతనో ప్రభుత్వ బ్యాంకు మేనేజర్.. అయిన బుద్ధి మాత్రం వంకర బుద్ధి. తాను పని చేస్తున్న బ్యాంకులోని అసిస్టెంట్ మేనేజర్ భార్యతోనే అతను వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ ఘటన ఏపీలోని విజయవాడలో జరిగింది. దీనిపై బ్యాంకు మేనజర్ భార్య న్యాయం కోసం పోరాడుతోంది. సదరు బ్యాంకు మేనేజర్ ను భార్య ప్రశ్నిస్తే తన బావ లాయర్ తనను ఏం చేయలేవు.. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ బెదిరిస్తున్నాడు. తాను పది మందితో తిరుగుతా అంటున్నాడు.
దీనిపై మీడియా ప్రశ్నించగా.. మీడియా ప్రతినిధులపై లాయర్ సుధాకర్ దుర్భాషలాడారు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనజర్ గా పని చేస్తున్న అశోక్, స్థానికంగా ఉన్న ఓ యువతితో 5 సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. వారికి 4 ఏళ్ల పాప కూడా ఉంది. తనకు పెళ్లైననాటి నుంచి తన భర్త అశోక్, అత్త, మామ, ఆడపడుచు అదనపు కట్నం కోసం వేధించారని బాధిత మహిళ తెలిపారు. తనను చిత్రహింసలు పెట్టేవారని వాపోయారు. అశోక్ ముంబైలో ఉద్యోగం చేస్తూ.. తనను విజయవాడలో ఉంచాడని చెప్పారు.

ముంబైలో అశోఖ్ మరో మహిళతో తిరిగేవాడని ఆరోపించించింది. ఇప్పుడు విజయవాడ కి ట్రాన్ఫర్ అవడంతో ఇక్కడ బ్రాచ్ లో అసిస్టెంట్ మేనేజర్ భార్య తో సంబంధం పెట్టుకొని వేరే కాపురం పెట్టాడని ఆరోపించింది. విడాకులు ఇవ్వాలని లేకపోతే తనను చంపేస్తాను అని బెదిరిస్తున్నాడని పేర్కొంది. తనకు, తన బిడ్డకు నాయ్యం చేయాలని ఆమె కోరుతున్నారు. తనకు నాయ్యం జరగక పోతే నేను నా బిడ్డ ఆత్మ హత్య చేసుకుంటామని చెబుతున్నారు.
కాగా అశోక్ పై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆమె సూచిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తేనే అశోక్ దారికి వస్తాడని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications