పాము కాటుకు బాలుడు మృతి, లేస్తాడని పూజలు

మృతి చెందిన గిరిజప్పను ఇంటికి తీసుకుపోయిన తల్లిదండ్రులకు ఓ స్వామిజీ వచ్చి ఆ బాలుడు చనిపోలేదని, కొంత సమయం తర్వాత లేస్తాడని చెప్పడంతో శనివారం వరకూ ఇంట్లోని మృతదేహాన్ని ఉంచుకున్నారు. స్వామిజీ చెప్పినట్లుగా బాలుడి మృత దేహానికి పశువుల పేడ రాసి వారి ఇంటి ముందు ఉంచారు. రాఘవేంద్ర స్వామి పాటలు పాడుతూ భజనలు చేస్తున్నారు.
ఎవరో స్వామి చెప్పారని చనిపోయిన బాలుడు బ్రతికి వస్తాడని నమ్మడం ఏంటని పలువురు స్థానికులు అంటున్నారు. గిరిజప్ప చనిపోయి సుమారు 24గంటలు గడిచినప్పటికీ కుటుంబ సభ్యులు ఇంటి ముందు పెట్టుకుని భజనలు చేస్తున్నారు. ఆ స్వామి ఎక్కడ్నుంచి వచ్చాడో ఎందుకు చెప్పాడో అని కుటుంబ సభ్యులు అంటున్నారు.
బాలుడు బ్రతికే అవకాశాలున్నాయని కుటుంబ సభ్యులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు శనివారం తెలుగు టీవీ చానెళ్లలో వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications