జువైనల్‌హోంలో దారుణం: సహచరుడ్ని టవల్‌తో ఉరేసి చంపిన బాలుడు
కడప: జిల్లాలోని జువైనెల్ హోమ్‌లో గురువారం దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు బాలుర మధ్య తీవ్ర ఘర్షణ జరిగి ఓ బాలుడి మృతికి కారణమైంది. నేరం చేసి శిక్షను అనుభవిస్తోన్న ఓ బాలుడు తన సహచర బాలుడితో గొడవపడ్డాడు.
ఈ ఘర్షణలో తీవ్ర అగ్రహానికి గురైన ఓ బాలుడు మరో బాలుడిని టవల్‌తో ఉరివేసి చంపాడు. హత్యకు గురైన బాలుడు చోరీ కేసులో అరెస్టయి రిమాండ్‌లో ఉన్న ముస్తాఫాగా తెలుస్తోంది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

పాఠశాల బస్సును ఢీకొన్న లారీ: విద్యార్థులకు గాయాలు
కర్నూలు జిల్లా పాణ్యంలో పాఠశాల బస్సు గురువారం ప్రమాదానికి గురైంది. పాణ్యం నుంచి నంద్యాల వైపు వెళ్తున్న పాఠశాల బస్సును... శాంతిరాం వైద్య కళాశాల వద్ద లారీ వెనుక నుంచి వచ్చి ఢీకొంది. ఓ మహిళ రోడ్డు దాటుతుండగా పాఠశాల బస్సు డ్రైవర్ సడన్ బ్రేకు వేశాడు.. అదే సమయంలో వెనుక వస్తున్న లారీ అదుపుతప్పి బస్సును ఢీకొంది. దీంతో బస్సు బోల్తా పడింది.
ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌తో పాటు ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. వీరిని సమీపంలో శాంతిరాం వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 15మంది విద్యార్థులు ఉన్నారు. స్థానికుల సమాచారంతో సీఐ మురళీధర్ రెడ్డి, ఎస్సై గోపాల్ రెడ్డి సంఘటనా స్థలానికి వివరాలు సేకరించారు.












Click it and Unblock the Notifications