సొంత వదినపైనే కన్నేసి..! మర్మాంగంలో కర్రను జొప్పించి

Subscribe to Oneindia Telugu

నర్సాపూర్ : వావి వరుసలకు సైతం తిలోదకాలిచ్చి మహిళలపై అత్యాచారాలకు తెగబడుతోన్న ఘటనలు దేశంలో రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ మహిళపై సొంత మరిది అత్యాచారానికి పాల్పడి అనంతరం అత్యంత పాశవికంగా ఆమెను హత్య చేసిన ఘటనలో పూర్తి వివరాలు బయటకొచ్చాయి.

వివరాల్లోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపూర్ మండలంలో ఉన్న మహమ్మద్ నగర్ పంచాయితీ పరిధిలోని సర్దార్ తండాలో మూడ్ సాలి (56) అనే మహిళ కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. తమ పొలంలో పండే కూరగాయలను సమీపంలోని వెంకట్రావ్ పేట గేట్ వద్దకు వెళ్లి విక్రయించి వస్తుంటుంది.

A brutal murder take place in narsapur

ఈ నేపథ్యంలోనే మూడ్ సాలిపై కన్నేసిన ఆమె మరిది మూడ్ జగన్ (46) ఎప్పటినుంచో ఆమెను లొంగదీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇదే క్రమంలో రోజు లాగే కూరగాయలు విక్రయించి గత నెల 8వ తేదీన ఇంటికి తిరిగొస్తున్న ఆమెపై అత్యాచారం చేశాడు జగన్. రోడ్డుపై ఆమె ఒంటరిగా నడుస్తూ వస్తుండడం గమనించి ఆమెను అడ్డుకుని కోరిక తీర్చాల్సిందిగా బలవంతం చేశాడు.

అయితే జగన్ తీరుకు ఆమెకు గట్టిగా ప్రతిఘటించడంతో.. సమీపంలోని ఓ వాగు వద్దకు తీసుకెళ్లి ఊపిరాడకుండా గొంతు నుమిలాడు. అనంతరం ఆమె స్ప్రుహ కోల్పోయాక తన కోరిక తీర్చుకున్న జగన్.. ఓ కర్రను ఆమె జనానంగంలోకి జొప్పించి తన పైశాచికత్వాన్ని బయటపెట్టుకున్నాడు. ఆ తర్వాత నిజం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో ఆమె ఒంటి మీదున్న దుస్తులను గొంతుకు బిగించి ఊపిరాడకుండా చేసి, తలపై బండరాయితో మోది చంపేశాడు.

రాత్రి సమయం.. నిర్జన ప్రాంతం కావడంతో.. హత్య సమయంలో ఆమె అరిచే ప్రయత్నం చేసిన ఆ అరుపులు ఎవరికీ వినపడలేదు. అయితే విచారణ చేపట్టిన పోలీసులు క్లూస్ టీమ్ ను రంగంలోకి దించడంతో.. నిందితుడి కోసం వేట ప్రారంభించిన జాగిలాలు సరిగ్గా జగన్ ఇంటి వద్దనే ఆగిపోవడంతో జగన్ అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అసలు నిజం బయటపడింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A brutal murder was taken place in narsapur. A woman namely mood sali was brutally murdered and raped by her hubbys brother jagan

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి