ఎంబసీకి చెప్పకుండా ఆ పని చెయ్యొద్దు: ఇరాన్ లోని భారతీయులకు హై అలెర్ట్!
ఇరాన్ ఇజ్రాయిల్ అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న లక్షలాది మంది భారతీయులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. యుద్ధ ప్రాంతాలలో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను తిరిగి వెనక్కి తీసుకురావడం కోసం మన ప్రభుత్వం కృషి చేస్తుంది.
ఇరాన్ లో ఉన్న భారతీయులకు ఇండియన్ ఎంబసీ హెచ్చరికలు
ఇప్పటికే ఇరాన్ లోని భారతీయ విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. కొంతమంది భారతీయులు యుద్ధ భయంతో ఇండియాకి తిరిగి రావడం కోసం రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ఇండియన్ ఎంబసీ మరోమారు ఇరాన్ లో ఉన్న భారతీయులకు హెచ్చరికలను జారీ చేసింది.ఇరాన్ సరిహద్దు దాటి ఆర్మేనియా వంటి దేశాల మీదుగా స్వదేశానికి చేరుకోవాలని ప్రయత్నిస్తున్న భారతీయులకు ఇండియన్ ఎంబసీ కీలక ఆదేశాలు ఇచ్చింది.

సరిహద్దులు దాటడానికి ప్రయత్నించవద్దన్న ఇండియన్ ఎంబసీ
ఎంబసీ కి ముందస్తు సమాచారం, సమన్వయం లేకుండా ఎవరు సరిహద్దులకు వెళ్లవద్దని, సరిహద్దులు దాటడానికి ప్రయత్నించవద్దని ఇండియన్ ఎంబసీ స్పష్టం చేసింది. అనవసరమైన ఇమిగ్రేషన్, రవాణా సమస్యలు తలెత్తుతాయని, ఎవరైనా సరిహద్దు దాటిన తర్వాత సమస్య వస్తే తాము సహాయం కూడా చేయలేమని హెచ్చరించింది.భారత రాయబార కార్యాలయం ఇరాన్ లో నివసిస్తున్న భారతీయ సమాజ సభ్యులతో తాము నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.
ఇండియన్ ఎంబసీ భారతీయులకు సూచనలు
ప్రయాణ సంబంధిత మరియు ఇతర అవసరాలలో సహాయం కావాలి అంటే అధికారిక మార్గాల ద్వారా ప్రయత్నం చేయాలని సూచించింది. ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో తాజా సమాచారాన్ని అందిస్తున్నామని సమాచారాన్ని తెలుసుకోవాలని ఇండియన్ ఎంబసీ భారతీయులకు సూచనలు చేసింది. ఈ కష్టకాలంలో ఏం చేయాలి ఏం చేయకూడదు అనే మార్గదర్శకాలు దీని ద్వారా లభిస్తాయని పేర్కొంది
భారతీయ విద్యార్థుల తరలింపు షురూ
ఇదిలా ఉంటే తొలి దశ తరలింపులో భాగంగా విదేశీ వ్యవహారాల శాఖ ఇరాన్ లోని భారత రాయబార కార్యాలయ సమన్వయంతో సుమారు 70 మంది భారతీయ విద్యార్థులను స్వదేశానికి తీసుకువచ్చారు. మరోవైపు ఇరాన్ నుంచి దాదాపు 550 మంది భారతీయులు ఆర్మేనియాకు చేరుకున్నారు. వీరిలో 284 మంది యాత్రికులు ఉన్నారు.
అధికారిక సూచనలను పాటించడమే ఉత్తమం
మరో 90 మంది అజర్బైజాన్ కు చేరుకున్నారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. ఏది ఏమైనా యుద్ధం కొనసాగుతున్న విపత్తు సమయంలో అధికారిక సూచనలను పాటించడమే ఉత్తమమని ఎంబసీ మరోమారు స్పష్టం చేసింది.
-
మరణించిన చిన్నారులతో ఇరాన్ స్పీకర్ 'శాంతి' ప్రయాణం! -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
ఇజ్రాయెల్ కావాలా ? చర్చలు కావాలా ? 'ట్రంప్ కు ఇరాన్ అల్టిమేటం..! -
పాకిస్తాన్ లో.. 1979 నాటి ఇస్లామిక్ రివాల్యూషన్ తర్వాత -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
US-Iran Ceasefire: ఇరాన్ సీజ్ ఫైర్ ను చెడగొట్టిన ఇజ్రాయెల్.. ! ట్రంప్ వాట్ నెక్ట్స్ ? -
టోల్ కక్కండి- రేట్ ఖరార్ చేసిన ఇరాన్ -
మా ఫింగర్స్ ట్రిగ్గర్ పైనే ఉన్నాయి.. ఏ క్షణమైనా : ఇరాన్ సంచలన వార్నింగ్ -
లీటర్ పెట్రోల్ కేవలం 3 రూపాయలకే.. మీకు కావాలా ?? -
పాకిస్తాన్ వెళ్తోన్న అమెరికా వైస్ ప్రెసిడెంట్ క్షేమంగా వెనక్కి రావాలని ప్రార్థనలు చేయండి -
యుద్ధంపై బెట్టింగ్ కాసి కోట్లు సంపాదించారు: వైట్ హౌస్ ఇన్సైడర్ ట్రేడింగ్ మిస్టరీ -
జాక్ పాట్ కొట్టిన భారత్.. భారీగా బయటపడ్డ చమురు నిక్షేపాలు.. 19 బావుల్లో..












Click it and Unblock the Notifications