చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చైనాకు చెందిన బడా ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శేషాచలం అడవుల నుంచి స్మగ్లర్లు సేకరించిన ఎర్రచందనం దుంగలను తమ దేశానికి తరలించేందుకు వచ్చిన చైనాకు చెందిన స్మగ్లర్ యాంగ్‌పింగ్‌‌ పోలీసులకు చిక్కాడు. చైనాకు చెందిన స్మగ్లర్ యాంగ్‌పింగ్‌ను చిత్తూరు పోలీసులు హైదరాబాద్‌లో శుక్రవారం అరెస్ట్ చేశారు.

చిత్తూరు పోలీసులు పక్కా వ్యూహంతో యాంగ్‌పింగ్‌ను పట్టుకోగలిగారు. యాంగ్‌పింగ్‌ తోపాటు హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.

A china redwood smuggler arrested in Hyderabad

పెద్దఎత్తున ఎర్రచందనం విదేశాలకు తరలిపోతోందన్న విషయంపై సమాచారం అందుకున్న ఏపి పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి వీరిని అరెస్ట్ చేశారు. కాసేపట్లో యాంగ్‌పింగ్‌‌ను చిత్తూరు కోర్టులో హాజరుపర్చనున్నారు.

ఇటీవలే పలువురు బడా స్మగర్లను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అంతకుముందు శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనం తరలిస్తున్న 20మంది తమిళనాడు కూలీలను ఎన్‌కౌంటర్ చేశారు.

English summary
A china redwood smuggler has been arrested in Hyderabad by Chittoor Police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X