Video:ఒక్క అడుగు తేడా..సంగం బ్యారేజీకి తప్పిన ముప్పు..!!
"మొంథా" తుఫాను విలయతాండవం చేసింది. ఆ దెబ్బకు పెన్నా నది సుడులు తిరిగింది. సరిగ్గా అదే టైమ్‌లో నెల్లూరు జిల్లాలోని సంగం బ్యారేజీ దగ్గర జరిగిన ఒక ఘటన... యావత్ జిల్లా రైతులతో పాటు అక్కడి జనాల గుండెల్లో దడ పుట్టించింది.లక్ష క్యూసెక్కుల వరద ప్రవాహం పెన్నా నదిలో ఉరకలేస్తుంటే... అకస్మాత్తుగా, 30 టన్నుల బరువున్న ఇసుక బోటు లంగరు తెగిపోయి, బ్యారేజీ గేట్లను ఢీకొట్టడానికి దూసుకొచ్చింది.
ఒక్క అడుగు తేడా: ఊహించలేని నష్టం..
పోటెత్తే వరద ఉద్ధృతికి, ఒకవేళ ఆ భారీ బోటు బ్యారేజీని ఆ బోటు ఢీకొని ఉన్నింటే... 85 గేట్లతో కట్టిన సంగం బ్యారేజీ పరిస్థితి అటో ఇటో అయ్యేది.3,85,000 ఎకరాలకు నీళ్లిచ్చే ఈ ప్రాజెక్టు ఏమైనా దెబ్బతింటే,వర్షాకాలం తర్వాత ఆ పొలాలు ఎండిపోయేవి,రైతులు కన్నీళ్లు పెట్టుకునేవాళ్లు.అంతేకాదు,పొదలకూరు,సంగం లాంటి ఊళ్ల మధ్య రాకపోకలకు ఆధారం ఈ బ్యారేజీనే.అది దెబ్బతింటే, జనజీవనం పూర్తిగా ఆగిపోయేది.గుండె దడ పుట్టించే ప్రమాదాన్ని తలుచుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది.

రంగంలోకి కలెక్టర్, ఎస్పీ
ఈ పెను ప్రమాదం గురించి తెలియగానే... జిల్లా యంత్రాంగం ఏమాత్రం ఆలస్యం చేయలేదు. ఈ ఒక్క క్షణంలోనే జిల్లా భవిష్యత్తు తమ చేతుల్లో ఉందని భావించిన కలెక్టర్ హిమాన్షు శుక్లా ,ఎస్పీ డా.అజిత వజ్రేంద్ర, హుటాహుటిన అక్కడికి పరుగులు తీశారు.పరిస్థితిని చూసి,అసలు నష్టం జరగకుండా వెంటనే సిబ్బందిని అలెర్ట్ చేశారు.అక్కడి నుంచి మొదలైంది అసలైన పోరాటం.
- 30 మంది NDRF (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) జవాన్లు
- 30 మంది SDRF (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) యోధులు
- 100 మందికి పైగా పోలీసు, భద్రతా సిబ్బంది
- కృష్ణపట్నం పోర్టు టీమ్, ఫైర్, ఇరిగేషన్ ఆఫీసర్లు
ఈ టీమ్‌లంతా కలిసికట్టుగా, అవిశ్రాంతంగా పోరాడారు.సుడులు తిరుగుతున్న పెన్నా ప్రవాహానికి ఎదురొడ్డి, ప్రాణాలకు తెగించి రెస్క్యూ ఆపరేషన్ చేశారు.వాళ్ల ధైర్యం,పట్టుదల చూస్తే ప్రకృతి కూడా ఆశ్చర్యపోయి ఉంటుంది.పెన్నా వరద మధ్య, ఆ బోటు బ్యారేజీ వైపుకు దూసుకుపోయే ప్రతి అడుగు... టిక్లింగ్ టైం బాంబ్‌లా అందరి గుండెల్లో దడ పుట్టించింది.చివరికి,ఉత్కంఠకు తెరదించుతూ... ఆ ప్రమాదకరమైన 30 టన్నుల బోటును బ్యారేజీకి కొన్ని మీటర్ల దూరంలోనే చాకచక్యంగా ఒడ్డుకు చేర్చారు.
సంగం బ్యారేజ్ కు తప్పిన ముప్పు.. హ్యాట్సాఫ్ టు టీమ్ ఏపీ..!!#SangamBarrage #AndhraPradesh #ApGovt #NewsUpdate #Oneindiatelugu pic.twitter.com/zshVmGXAgt
— oneindiatelugu (@oneindiatelugu) October 30, 2025
రైతుల ఆశలు నిలిచాయి
అద్భుతం జరిగింది..ఒక విపత్తు తప్పింది.దాదాపు నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టుకు రక్షణ దొరికింది.సంగం బ్యారేజీకి ప్రమాదం లేకుండా పోయింది.రైతులకు, ప్రజలకు జరిగిన ఈ పెద్ద ఉపకారం వెనుక... అధికారులు, సిబ్బంది చూపిన అంకితభావం, తెగువ ఎన్నటికీ మరువలేనివి. సంగం బ్యారేజీ నిలిచింది. రైతుల ఆశలు నిలిచాయి.అందుకే హ్యాట్సాఫ్ టూ టీం ఏపీ.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications