వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజధాని ముంపు ప్రాంతమని నిరూపిస్తారా... నా భూమి రాసిస్తా ..బొత్సాను సవాల్ చేసిన ఓ సాధారణ మహిళ

|
Google Oneindia TeluguNews

ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి పై బొత్స సత్యనారాయణ చేసిన సంచలన వ్యాఖ్యలు ఏపీలో ఇంకా హీట్ ను పుట్టిస్తూనే ఉన్నాయి. రాష్ట్ర రాజధాని అమరావతి సురక్షితం కాదని వరద ముంపుకు గురయ్యే ప్రాంతాన్ని రాజధానిగా ఎందుకు ఎంచుకున్నారో అర్ధం కావట్లేదు అని దీనిమీద మళ్లీ చర్చించాల్సిన అవసరం ఉందని బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై అటు రాజధాని వాసుల్లో ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఇక తన వ్యాఖ్యలను సమర్ధించుకున్న బొత్సా సత్యన్నారాయణ ఏపీలో ఇది రగడగా మారుతున్నా దీన్ని మరింత పెద్ద అంశంగా మార్చేశారు.

<strong>సీఎం జగన్ కాన్వాయ్ ని అడ్డుకునే యత్నం చేసిన రాజధాని రైతులు ... అడ్డుకున్న పోలీసులు</strong>సీఎం జగన్ కాన్వాయ్ ని అడ్డుకునే యత్నం చేసిన రాజధాని రైతులు ... అడ్డుకున్న పోలీసులు

 బొత్సా వ్యాఖ్యలతో ఏపీ రాజధాని అమరావతి పై నీలినీడలు.. ఆగ్రహంలో రాజధాని వాసులు

బొత్సా వ్యాఖ్యలతో ఏపీ రాజధాని అమరావతి పై నీలినీడలు.. ఆగ్రహంలో రాజధాని వాసులు

బొత్సా వ్యాఖ్యలతో ఏపీ రాజధాని అమరావతి పై నీలినీడలు అలుముకున్నాయి. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాజధానిపై అన్నీ అనుమానాలే. రాజధాని మారుతుందా అని కొంతకాలం రగడ జరిగింది. ఇప్పుడిప్పుడే సర్దుకుంటుంది అనుకున్న తరుణంలో బొత్సా చేసిన వ్యాఖ్యలతో మరోసారి అమరావతిపై నీలినీడలు అలముకున్నాయి. బొత్సా వ్యాఖ్యలతో మండిపడుతున్న రాజధాని రైతులు ఆందోళన బాట పడితే, ఇటు రాజకీయ పార్టీలు సైతం రాజధాని తరలింపు ప్రచారానికి జగన్ సర్కార్ ఫుల్ స్టాప్ పెట్టాలని కోరుతున్నారు. జగన్ స్పష్టత ఇచ్చి ఈ ప్రచారాన్ని, ప్రజల్లో నెలకొన్న గందరగోళాన్ని ఆపాలని కోరుతున్నారు. కానీ జగన్ రాజధాని విషయంలో జరుగుతున్నదంతా తెలిసి కూడా సైలెంట్ గా ఉన్నారు.

రాజధాని ముంపు ప్రాంతం అని నిరూపిస్తే మూడున్నరెకరాల భూమి రాసిస్తా అన్న ఓ మహిళ

రాజధాని ముంపు ప్రాంతం అని నిరూపిస్తే మూడున్నరెకరాల భూమి రాసిస్తా అన్న ఓ మహిళ

తాజాగా అమరావతికి చెందిన ఒక సాధారణ మహిళ మంత్రి బొత్సా సత్యనారాయణకు సవాలు విసిరారు. ఇది వరద ప్రభావిత ప్రాంతం, ముంపు ప్రాంతం అని రాజధాని ప్రాంతం వరదలకు గురవుతుంది అని మంత్రి బొత్సా నిరూపించగలరా అని ఆమె ప్రశ్నించారు. అమరావతి రాజధాని ప్రాంతం ముంపు ప్రాంతం అని ఆయన నిరూపిస్తే, ఆమె తన తల్లిదండ్రులు తనకు ఇచ్చిన మూడున్నర ఎకరాల స్థలాన్ని బొత్సా సత్యనారాయణ పేరు మీద రాసిస్తాను అని ఓ సాధారణ మహిళ సవాల్ చేశారు . అమరావతి భూములు రాజధాని నగరానికి తగినవి కావు అని అతను ఇంతకు ముందు ఎందుకు చెప్పలేదని ఆమె బొత్సాను ప్రశ్నించారు .

బొత్సాపై ఓ సాధారణ మహిళ చేసిన సవాల్ ఏపీలో హాట్ టాపిక్

బొత్సాపై ఓ సాధారణ మహిళ చేసిన సవాల్ ఏపీలో హాట్ టాపిక్

ఇక తాజాగా కృష్ణా నది వరదల నేపథ్యంలో రాజధాని ప్రాంతం ముంపుకు గురి అయిందని, రాజధానిగా అమరావతి సురక్షితం కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు వైసిపి నేత, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. అసలే వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాజధానిని వేరే ప్రాంతానికి తరలిస్తారు అన్న పుకార్లు షికార్లు చేశాయి. ఇక ఆ పుకార్లకు ఊతం ఇచ్చినట్లుగా బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు అందరూ మండిపడుతున్నారు. ప్రభుత్వం స్పందించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్తున్నారు. ఈ నేపధ్యంలో ఓ సాధారణ మహిళా చేసిన సవాల్ ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.

English summary
A common woman belong to Amaravati throws a challenge to Minister Botsa Satyanarayana. She questioned can Minister prove that capital region was flooded? If he proves that Amaravati capital region was flooded, then she will write her three-and-a-half-acre plot given by her parents on Botsa Satyanarayana's name.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X