కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పులివెందుల ప్రజల మనోభావాలు దెబ్బతీశారు: పవన్ కళ్యాణ్‌పై ఫిర్యాదు

|
Google Oneindia TeluguNews

అమరావతి/కడప: పులివెందుల ప్రజల మనోభావాలు దెబ్బతినేలా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై పులివెందుల మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్, కౌన్సిలర్లు, వైయస్సార్సీపీ నాయకులు పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం వరప్రసాద్ మీడియాతో మాట్లాడారు.

పులివెందుల అంటేనే ప్రేమ, అభిమానాలకు, పౌరుషానికి పుట్టినిల్లు అని ఆయన అన్నారు. మన రాష్ట్రానికి ఇద్దరు మంచి ముఖ్యమంత్రులను ఈ ప్రాంత ప్రజలుఅందించారని అన్నారు. టీడీపీ, బీజేపీ ఇచ్చే ప్యాకేజీలకు అమ్ముడుపోయిన పవన్ కళ్యాణ్‌కు పులివెందుల ప్రజల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. పులివెందుల ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

 A complaint filed against pawan Kalyan in pulivendula urban police station

పేమెంట్ కోసం సొల్లు కబుర్లంటూ కొడాలి నాని ఫైర్

సీఎం వైఎస్ జగన్ పాలనలో ప్రజలంతా ఆనందంగా ఉన్నారని మంత్రి కొడాలి నాని అన్నారు. ఎన్నికల్లో ఓడిపోతామనే చంద్రబాబు నాయుడు కుంటిసాకులు చెబుతున్నారని అన్నారు. పేమెంట్ కోసం సొల్లు కబుర్లు చెప్పే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని విమర్శించారు. ఓటు హక్కు లేని పిల్లలతో సీఎం సీఎం అని పిలిపించుకునే వ్యక్తని చురకలంటించారు.

జన సైనికులు.. జన సైకిల్‌గా మారారని కొడాలి నాని ఎద్దేవా చేశారు. కుమారుడు లోకేష్ మంగళగిరిలో ఓడిపోయినా చంద్రబాబు బుద్ధి రాలేదన్నారు. చంద్రబాబుకు డిపాజిట్లు కూడా వస్తాయో రావో చూసుకోవాలంటూ సెటైర్లు వేశారు. సీపీఎం, బీజేపీ నోటాతో పోటీ పడే పార్టీలంటూ మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు.

English summary
A complaint filed against pawan Kalyan in pulivendula urban police station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X