జగనయ్యా.. కాపాడు; వైసీపీ ఎమ్మెల్యే విడదల రజినీపై సంచలన ఆరోపణలతో ఓ కుటుంబం సెల్ఫీ వీడియో
చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజినిపై ఓ కుటుంబం తీసిన సెల్ఫీ వీడియో ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని వేడుకుంటూ ఎడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన ఓ కుటుంబం సెల్ఫీ వీడియో తీసి తమను కాపాడాలంటూ విజ్ఞప్తి చేశారు. స్థానిక చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని పట్టించుకోవటం లేదని, తమకు ప్రాణ హాని ఉందని వారు ఆ సెల్ఫీ వీడియోలో లబో దిబో మన్నారు.

తమపై హత్యాయత్నం జరిగినా ఇప్పటివరకు చర్యలు లేవన్న కుటుంబం
ఎడ్లపాడు మండలం తిమ్మాపురం కి చెందిన ఓ కుటుంబం మూడు నెలల క్రితం తమపై కొందరు కత్తులతో దాడి చేశారని, తమపై దాడి చేసిన వారిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు ఎమ్మెల్యే రజనీని కలిసి తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినా ఆమె కనికరించలేదని, కలెక్టర్ ను కలిసి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకుండా ఎమ్మెల్యే విడదల రజిని అడ్డుపడుతున్నారని బాధిత కుటుంబం ఆ సెల్ఫీ వీడియోలో ఆరోపించింది.

ఎమ్మెల్యే రజినీ కాళ్ళ మీద పడి కాపాడాలని అడిగినా కనికరించలేదు
విడదల రజినీని అభ్యర్థిగా ప్రకటిస్తే నాడు సంతోషించామని, నేడు రజినీ మా ఎమ్మెల్యే కావటం నియోజకవర్గ కర్మగా భావిస్తున్నామని వారు పేర్కొన్నారు. ప్రాణహాని ఉందని ఎమ్మెల్యే రజినీ కాళ్ళ మీద పడినా ఆమె కనికరం చూపలేదని వారు ఆరోపిస్తున్నారు. తమపై హత్యాయత్నం చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని, సోమవారం లోగా నిందితులను అరెస్టు చేయకపోతే తామంతా సూసైడ్ చేసుకుంటామంటూ బాధిత కుటుంబం తమ ఆవేదనను వీడియో ద్వారా వ్యక్తం చేసింది.

జగనయ్యా .. నువ్వు నా కొడుకులాంటోడివి.. కన్నీరు పెట్టుకున్న తల్లి
జగనయ్యా నువ్వు నా కొడుకు లాంటి వాడివే అంటూ బాధిత కుటుంబ పెద్ద జగన్ ను ఉద్దేశించి మాట్లాడుతూ కన్నీరు మున్నీరయ్యింది. తన కొడుకులకు తగిలిన గాయాలను చూపించి, న్యాయం చేయండి అంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఆ తల్లి. తమ కుటుంబానికి జగన్ అంటే ఎంతో పిచ్చి అని, జగన్ మీద ఉన్న ప్రేమ కారణంగానే వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన విడదల రజిని గెలుపు కోసం చిలకలూరిపేటలో రాత్రింబవళ్ళు పనిచేశారని వారు పేర్కొన్నారు. జగన్ తో తన కొడుకు ఫోటో కూడా తీసుకున్నాడని ఆమె ఆ వీడియోలో పేర్కొన్నారు.

ఈ రోజుకీ తమను బెదిరిస్తున్నారు.. వారిని అరెస్ట్ చెయ్యకుంటే సూసైడ్ చేసుకుంటాం
మీ గెలుపు కోసం ఇంతలా పనిచేసినా, మా విషయంలో మీరు ఈ విధంగా చేయడం న్యాయమా అంటూ, ఇవేం రాజకీయాలు అంటూ విడదల రజినిని ప్రశ్నించారు. ఆధిపత్యం కోసం గ్రామంలో వర్గపోరు సృష్టించే ప్రయత్నం జరుగుతుందని, ఈ రోజుకీ తమను బెదిరిస్తున్నారని, సోమవారం లోగా తమపై దాడి చేసిన నిందితులను అరెస్టు చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని వారు వీడియోలో వెల్లడించారు. అయితే అసలు ఇంతకీ ఏం జరిగింది? ఆ కుటుంబం పై దాడి చేసిన వారు ఎవరు? వారు దాడి చెయ్యటానికి గల కారణాలేంటి ? వారికి ఎమ్మెల్యే విడదల రజిని కి మధ్య ఉన్న గొడవ ఏమిటి ? అన్నది తెలియాల్సి ఉంది.

చిలకలూరిపేటలో సెల్ఫీ వీడియో కలకలం .. రజిని స్పందిస్తారా ?
ప్రస్తుతం ఈ సెల్ఫీ వీడియో కలకలం పై చిలకలూరిపేట నియోజకవర్గంలో చర్చ జరుగుతుంది. దీనిపై చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని స్పందించాల్సి ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ నేతలపై, ఎమ్మెల్యేలపై అనేక ఆరోపణలు వెల్లువగా మారాయి. రాష్ట్రంలోని అనేక జిల్లాలలో ఇటీవల కాలంలో జరుగుతున్న అరాచకాలు, అన్యాయాలు వీడియోల రూపంలో దర్శనం ఇస్తున్నాయి. ఇక సెల్ఫీ వీడియోల కలకలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిత్య కృత్యంగా మారింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications