జనసేన నేత బాగోతాలను లైవ్‌లో కడిగిపారేసిన జర్నలిస్ట్.. ఇది కదా అసలు జర్నలిజం అంటే
తిరుపతి జనసేన నాయకుడు కిరణ్ రాయల్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.కిరణ్ రాయల్ నిజస్వరూపాన్ని ఓ మహిళ బయటపెట్టింది.కిరణ్ మోసాన్ని వివరిస్తూ ఓ మహిళ విడుదల చేసిన వీడియో కలకలం రేపిన సంగతి తెలిసిందే. కిరణ్‌రాయల్ తనను బెదిరించి.. రూ.కోటికిపైగా నగదు, 25 సవర్ల బంగారం కాజేసి ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేశాడని.. అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ లక్ష్మి అనే మహిళ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బాధిత మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియో సంచలనంగా మారింది.ఇప్పుడు అప్పు తీర్చమని అడిగితే తన పిల్లల్ని చంపుతామని బెదిరిస్తున్నాడని ఆరోపించారు. తనకు అప్పులు ఇచ్చిన వాళ్ల దగ్గర నుంచి ఒత్తిళ్లు ఎక్కువ అయ్యాయన్న లక్ష్మి.. తనకు చావే శరణ్యమంటూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు.అయితే జగన్‌ను విమర్శించడం వల్లే తనని ఈ కేసులో ఇరికించారని చెప్పి కిరణ్ రాయల్ తప్పించుకునే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి ఓ ప్రముఖ ఛానెల్‌తో లైవ్ ప్రొగ్రామ్‌లో కిరణ్ రాయల్ మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ జర్నలిస్ట్, కిరణ్ రాయల్‌కు మధ్య ఆసక్తికర సంభాషణ సాగింది.

లక్ష్మిని మీ సోదరిగా భావించవచ్చా అంటే, ఆమె మా ఫ్లాట్ పక్కనే ఉండే మహిళ అని చెల్లెలు కాదని కిరణ్ రాయల్ చెప్పుకొచ్చారు. దీనికి సదరు జర్నలిస్ట్ మాట్లాడుతూ.. మా ఫ్లాట్ పక్కన చాలామంది ఉంటారని, వారెవ్వరూ కూడా తనతో ఇలా చేయలేదని, మా ఫ్లాట్‌కు వచ్చే మహిళలు, మా ఆవిడ కోసం వస్తారని, అంతే కాని, హోటల్‌కు తీసుకువెళ్లి గొలుసు గిఫ్ట్‌గా ఇచ్చి ఐ లవ్ యు చెప్పలేదని జర్నలిస్ట్ , కిరణ్ రాయల్‌కు కౌంటరిచ్చారు.
ఇది కద అసలు జర్నలిజం అంటే , అన్ని విధాలుగా కడిగేసాడు 🔥👍
— YSRCP UK (@uk_ysrcp) February 11, 2025
Kudos to that journalist 💥🙌 pic.twitter.com/MOhVyLds5V
ఇలా ఆ జర్నలిస్టు ప్రశ్నల వర్షం కురిపించడంతో కిరణ్ రాయల్‌కు ఏం చెప్పాలో తెలియలేదు. చివరికి నీళ్లు నమలక తప్పలేదు. మరోవైపు బాధితురాల లక్ష్మిపై అనేక కేసులు ఉండటంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అలాగే లక్ష్మి అభియోగల నేపథ్యంలో కిరణ్ రాయల్‌ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన అధినాయకత్వం ఉత్తర్వులు జారీ చేసింది.












Click it and Unblock the Notifications