పునాదులు కదులుతున్నాయి- కూటమికి ప్రముఖ వ్యూహకర్త హెచ్చరిక..!!

ఏపీ రాజకీయాల్లో అనూహ్య సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం పది నెలల పాలన పూర్తి చేసుకుంది. అటు వైసీపీ తిరిగి బలం పెంచుకునే వ్యూహాలు అమలు చేస్తోంది. కూటమి పైన ప్రజల్లో వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందని వైసీపీ అంచనా వేస్తోంది. ఇదే సమయంలో కొన్ని సర్వేలు ప్రజా మూడ్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కూటమికి ఊహించని ఫలితాలు అందులో కనిపిస్తున్నాయి. తాజాగా మరో సర్వే ప్రముఖుడు కూటమి పాలన పైన ప్రస్తావించిన అంశాలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి.

కూటమి పాలన పై
ఏపీలో ఈ మధ్య కాలంలోనే ఒక సర్వే ఎమ్మెల్యేల పని తీరు గురించి జరగ్గా.. కీలక అంశాలు ఆ సర్వేలో బయటకు వచ్చాయి. 71 మంది కూటమి ఎమ్మెల్యేల పని తీరు పైన ఆ నియోజకవర్గాల్లో 30 శాతం ప్రజలు కూడా ఆసక్తిగా లేరని సర్వేలో తేలింది. ఇప్పుడు మరో సర్వే నిపుణుడు తాజా ఏపీలో కూటమి పాలన పైన వెల్లడించిన అభిప్రాయాలు ఆసక్తి కరంగా మారాయి. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో ఎమ్మెల్యేల పని తీరు పైన సర్వే నివేదిక వెల్లడించనున్నట్లు ఆయన తన సోషల్ మీడియా ఖాతా వేదికగా వెల్లడించారు. 2024 ఎన్నికల సమయంలోనూ ఇదే నిపుణుడు వెల్లడించిన ఫలితాల అంచనాలు దాదాపు కూటమి గెలిచిన సీట్లకు దగ్గరగా ఉన్నాయి. దీంతో, ఇప్పుడు ఈయన వెల్లడించిన అంశాలు వైరల్ అవుతున్నాయి.

a-famous-survey-analyst-reveals-the-public-mod-on-nda-govt-in-ap

ఈ నాలుగు అంశాలే
ఇక, సర్వే నిపుణుడు తన పోస్టింగ్ లో ..అవును.. వాళ్ళిద్దరూ కష్టపడుతున్నారు. కానీ, పురాతన పాత చింతకాయ పచ్చడి ఆలోచనలు..భ్రమల్లో జీవించడం, మితిమీరిన అవినీతి, క్యాడర్లో అసంతృప్తి.. ఇదీ క్లుప్తంగా కూటమి పాలన అంటూ పేర్కొన్నారు. ఇప్పటికే ఒక వచ్చిన ఒక సర్వే లో సైతం దాదాపుగా ఇవే అంశాల కారణంగా ప్రజల్లో ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉందని తేల్చి చెప్పారు.కేవ‌లం 10 నెల‌ల పాల‌న పూర్తి చేసుకుంటున్న కూట‌మిలోని ప్ర‌జాప్ర‌తినిధుల‌పై ఏకంగా 70 శాతం వ్య‌తిరేక‌త ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల సంఖ్య 71గా ఆ సర్వేలో తేల్చారు. ఎమ్మెల్యేలు మ‌ద్యం, ల్యాండ్, రియ‌ల్ ఎస్టేట్ వ్యవహారాలు నడపటం ప్రజల్లో ఈ స్థాయిలో భారీ వ్యతిరేకతకు కారణంగా విశ్లేషించారు.

Take a Poll

సర్వేల్లో కీలక అంశాలు..
ఈ సర్వే సంస్థలు వెల్లడించిన అంశాల్లో నియోజ‌క‌వ‌ర్గాల్లో వివిధ సంస్థ‌లు, వ్య‌క్తుల నుంచి భారీ మొత్తంలో లంచం రూపంలో డ‌బ్బు గుంజుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మైనింగ్ మాఫియా, కాంట్రాక్ట‌ర్ల నుంచి ముక్కు పిండి మ‌రీ వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతున్నట్లు వివరించారు.అలాగే చిన్న‌చిన్న వ్యాపార‌స్తులు, ప్ర‌భుత్వ ఉద్యోగుల నుంచి కూడా డ‌బ్బు తీసుకోవటం భారీ వ్యతిరేకతకు కారణంగా మారుతోంది. ఇక.. కొంత మంది ప్ర‌జా ప్ర‌తినిధులు కేడ‌ర్‌కు అందుబాటులో వుండ‌డం లేదని తేల్చి చెప్పారు. ప‌ది నెల‌ల్లోనే సీన్ రివ‌ర్స్ అవుతోందన సర్వే సంస్థలు కూటమి నేతలు అలర్ట్ చేస్తున్నాయి. ఈ సర్వే నివేదికల ఆధారంగా కూటమి అధినేతలు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు మూడు పార్టీల్లోనూ ఆసక్తిగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+