చిచ్చు పెట్టింది మీరు కాదా తమ్మూళ్లూ!: విజయవాడలో ఫ్లెక్సీ కలకలం, వెంటనే తొలగించారు
విజయవాడ: తెలుగుదేశం, బీజేపీ నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో విజయవాడలో టీడీపీకి వ్యతిరేకంగా వెలసిన ఓ ఫ్లెక్సీ కలకలం రేపుతోంది. టీడీపీ తీరునుకు నిరసన గుర్తుగా రాత్రికి రాత్రే ప్రత్యక్షమైన ఈ హోర్డింగ్ చర్చనీయాంశంగా మారింది.
కాగా, అధికార టీడీపీ పార్టీకి వ్యతిరేకంగా ఉండటంతో అధికార పార్టీ నేతలు.. మున్సిపల్ సిబ్బందితో ఈ ఫ్లెక్సీని వెంటనే తొలగించేయడం గమనార్హం.

ఆ భారీ ఫ్లెక్సీలో.. 'ప్రజలారా ఆలోచించడి! 'కేంద్రం ఇచ్చిన స్పెషల్ ప్యాకేజీ నిధులు తీసుకుంటూ.. యూ టర్న్ తీసుకొని మళ్లీ హోదానే కావాలని అడగటంలో ఆంతర్యం ఏమిటో 5 కోట్ల ఆంధ్రులకు తెలుసులే!.. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులలో వేల కోట్ల రూపాయల అవినీతి జరగడం నిజం కాదా?.. తెలుగు దేశం తమ్మూళ్లూ.. పోలవరం, పట్టిసీమ, రాజధాని భూముల కేటాయింపులపై సీబీఐ విచారణ కోరదామా? కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా ఇళ్లు ఇస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల దగ్గర నుంచి అధిక డబ్బులు వసూలు చేయడం ఎంత వరకు కరెక్టు!.. కాల్ మనీ కేసుల విచారణ ఏమైంది..? ఎన్నికల సమయంలో ఇచ్చిన 600 హామీలు ఏమయ్యాయి తెలుగుదేశం తమ్మూళ్లూ! కులాల మధ్య చిచ్చు పెట్టింది మీరు కాదా తెలుగు దేశం తమ్మూళ్లూ?' ఇట్లు 5 కోట్ల ఆంధ్రులు అని రాసివుంది.
అయితే ఈ ఫ్లెక్సీలను ఎవరు ఏర్పాటు చేశారనే దానిపై స్పష్టత రాలేదు. కానీ, ఈ బీజేపీ శ్రేణులే ఏర్పాటు చేశాయని టీడీపీ ఆరోపిస్తోంది. కాగా, ఇటీవల కేంద్రానికి, బీజేపీకి వ్యతిరేకంగా టీడీపీ కూడా ఇలాంటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం గమనార్హం.
-
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ











Click it and Unblock the Notifications