వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని చంపారా, నాలుగేళ్ళ బాలుడి మృతి

నాలుగేళ్ళ బాలుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఈ ఘటన కడపజిల్లాలో చోటుచేసుకొంది. వివాహేతర సంబంధం కారణంగానే ఈ బాలుడిని హత్య చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు.

కడప :ఓ నాలుగేళ్ళ చిన్నారి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ బాలుడి హత్యకు గల కారణాలు ఏమిటనే విషయం ఇంకా బయటకు రాలేదు. కుటుంబసభ్యులే ఈ దారుణానికి ఒడిగట్టారా లేదా మరేవరైనా హత్య చేశారా అనే విషయమై ఇంకా తేలాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

కడప జిల్లా చిట్వేలు మండల పరిధిలోని సిద్దారెడ్డి పల్లె పంచాయితీ అంకాళమ్మ ఎస్ టి కాలనీలో నాలుగేళ్ళ శివ అనే బాలుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఈ ఘటన మంగళవారం నాడు ఈ ఘటన వెలుగు చూసింది.ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

సిద్దారెడ్డిపల్లె పంచాయితీ అంకాళమ్మ ఎస్ టి కాలనీకి చెందిన జలకం వీరమ్మకు అయిదేళ్ళ క్రితం పుల్లంపేట మండలం రాజుగారిపల్లెకు చెందిన సుబ్బరాయిడితో వివాహం జరిగింది. భార్య,భర్తలు వ్యవసాయకూలీలుగా పనిచేసేవారు. వీరికి కొడుుకు పుట్టాడు. అతనికి శివ అని పేరు పెట్టాడు. అతని వయస్సు నాలుగేళ్ళు.

a four years boy murder in kadapa district

కారణాలు ఏమిటో గాని సుబ్బారాయుడు వీరమ్మను వదిలేసి మరోక యువతిని వివాహం చేసుకొని వేరుగా జీవనం సాగిస్తున్నాడు. అయితే వీరమ్మ కూడ పదిరోజుల క్రితం అదే కాలనీకి చెందిన పెంచలయ్య అనే వ్యక్తిని వివాహం చేసుకొంది. ఇదివరకే పెంచలయ్యకు వివాహమైంది. ఆయన కూడ తన భార్యను వదిలేశాడు..

వీరిద్దరూ కూడ బాలుడితో కలిసి రాచపల్లె ఎగువన ఉన్న ఎస్ టి కాలనీలో ఉన్న తమ బంధువు ఇంటికి వచ్చారు. అక్కడి నుండి బాలుడిని తీసుకొని తాము నివాసం ఉండే ఎస్ టి కాలనీకి తిరిగివచ్చారు.

అయితే బాలుడిని ఎప్పుడు హత్య చేశారు, ఎవరు హత్య చేశారనే విషయమై పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. వివాహేతర సంబంధం కారణంగానే బాలుడు హత్యకు గురయ్యాడనే అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+