రెండుగా చీలిపోయిన భూమి...తీవ్ర భయాందోళనలతో స్థానికులు:గుంటూరు జిల్లాలో విచిత్రం
గుంటూరు: అవును!...అక్కడ భూమి రెండుగా చీలిపోయింది. అడ్డంగా...భూమిని రెండుగా వేరు చేస్తూ...అలా ఏ పదో ఇరవయ్యో మీటర్లు కాదు...దాదాపు నాలుగు అడుగుల వెడల్పు...పది అడుగుల లోతుతో...సుమారు 500 మీటర్ల మేరా భూమి రెండుగా విడిపోయింది.
గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం బోదలవీడు గ్రామంలో మంత్రపు వాగు సమీపంలో శనివారం తొలి ఝాములో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఉదయం లేచేసరికి భూమి లోతుగా రెండుగా చీలి ఉండటంతో స్థానికులు దిగ్భ్రాంతి చెందారు. పైగా మంత్రపు వాగు సమీపంలోనే ఈ సంఘటన చోటుచేసుకోవడంతో గ్రామస్తులు ఆశ్చర్యంగా చర్చించుకుంటున్నారు. ముందు ముందు ఏం ముప్పు ముంచుకురానుందోనని భయాందోళనలతో వణికిపోతున్నారు.
సహజంగా భూమి బీటలు వాడటం...నెర్రలు వారడం...పొలాల్లో చూస్తూనే ఉంటాం...ఇవి భూమిపై చిన్న చీలికలుగా ఏర్పడి...సన్నటి గీతల్లా కనిపిస్తుంటాయి. అయితే ఈ చీలిక మనిషి అవలీలగా అమాంతం లోపలికి పడిపోయేంత వెడల్పు-లోతుతో అరకిలోమీటర్ మేరా ఏర్పడితే...ఆ దృశ్యం చూడ్డానికే ఎవరికైనా భయానకంగా ఉంటుంది.

గుంటూరు జిల్లా బోదలవీడు గ్రామంలో చోటు చేసుకున్న ఈ పరిణామం చూసి గ్రామస్థులు భయంతో వణికి పోతుండగా...పర్యావరణవేత్తలు కూడా ఆశ్చర్యపోతున్నారు. సాధారణంలో భూమి పొరల్లో చిన్న చిన్న పగుళ్లు సహజమే కాని...ఇంత భారీ స్థాయిలో చీలిక అధ్యయనం చేయాల్సిందేనంటున్నారు.
మరోవైపు ఈ ఘటన చోటుచేసుకోవడంపై స్థానికంగానే కాక చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఈ సంఘటనకు సంబంధించి అప్పుడే వదంతులు, కథలు కథలు ప్రచారం జరుగుతున్నాయి. భూకంపం రోబోతుందంటూ కొందరు ప్రచారం ప్రారంభించారు. ఇక్కడ భూమి ఇలా చీలిపోవడంపై శాస్త్రజ్ఞులు పరిశీలించి కారణం తెలియజేస్తే బావుంటుందని స్థానిక విద్యావంతులు కోరుతున్నారు.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications