హత్యా?ఆత్మహత్యా?: ప్యాసింజర్‌ రైల్లో ఉరేసుకుని యువతి మృతి

Subscribe to Oneindia Telugu

నెల్లూరు: విజయవాడ నుంచి నెల్లూరు వెళ్తున్న బిట్రగుంట ప్యాసింజర్ రైల్లో గుర్తు తెలియని ఓ యువతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. యువతి వద్ద లభించిన డైరీ ఆధారంగా పోలీసులు ఆమె వివరాలు కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే, యువతి వద్ద లభించిన డైరీలో పేరున్న పేజీని చింపివేసి ఉండటంతో ఆమె ఎవరో కనుక్కోవడానికి పోలీసులకు కష్టతరంగా మారింది. మృతి చెందిన యువతి వయసు సుమారు 20నుంచి24ఏళ్లు ఉండవచ్చని పోలీసులు చెబుతున్నారు.

A girl allegedly committed suicide in a train at Nellore

రైలు ఒంగోలు రైల్వేస్టేషన్‌కు వచ్చిన సమయంలో యువతి ఒంటరిగా ఉండటం గమనించి యువతిని తలుపు వేసుకోమని టీసీ సూచించినట్లుగా తెలిసింది. కాగా, కావలి రైల్వేస్టేషన్‌కి వచ్చేసరికి రైల్లోనే ఆమె ఉరి వేసుకుని మృతిచెందింది.

ఈ క్రమంలో ఆ యువతి మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎవరైనా హత్య చేసి ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా? అనుమానం కలుగుతోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A girl allegedly committed suicide in a train at Nellore on Thursday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి