దారుణం: యువతిపై గ్యాంగ్‌రేప్ చేసి హత్య, నిందితుల అరెస్ట్
రంగారెడ్డి: జిల్లాలోని వికారాబాద్ మండలం బురాంతపల్లి శివారులో దారుణం జరిగింది. యువతిపై అత్యాచారం చేసిన దుండగులు ఆమె గొంతు నులిమి హత్య చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసులో ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ముగ్గురు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: ముగ్గురు పిల్లలతో సహా ఓ తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. హుస్సేన్‌సాగర్‌లో దూకి ముగ్గురు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకోవడానికి ఓ తల్లి ప్రయత్నించింది. తల్లితో సహా నీళ్లల్లో దూకిన ముగ్గురు పిల్లలను లేక్ పోలీసులు రక్షించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తల్లికి కౌన్సెలింగ్ ఇచ్చారు.

చికిత్స పొందుతూ చిన్నారి మృతి
నల్గొండ: మిర్యాలగూడ పట్టణంలోని తాళ్లగడ్డలో నవంబర్ 24న రాత్రి తాళ్లగడ్డ ఇందిరమ్మ కాలనీలో మినీ గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో తీవ్రంగా గాయపడిన గణపురం పవన్‌కల్యాణ్ (6) హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడని వన్‌టౌన్ పోలీసులు తెలిపారు.
సెంట్రింగ్ పనిచేసే వెంకన్న కుమారుడు పవన్‌కు ఈ ప్రమాదంలో కాళ్లు, చేతులు, ముఖానికి గాయాలు కాగా, 17 రోజుల పాటు చికిత్స పొంది చివరికి మృత్యువాత పడ్డాడు. అనుకోని ప్రమాదంలో ఆరేళ్ల బాలుడు మృతి చెందడం ఆ కుటుంబంలో విషాదం నింపింది.












Click it and Unblock the Notifications