అమ్మాయి కిడ్నాప్: గదిలో బంధించి రేప్, అరెస్ట్

పోలీసుల కథనం ప్రకారం.. నల్గొండ జిల్లాలోని జాజిరెడ్డిగూడెం మండలం కోమల గ్రామానికి చెందిన గౌరారపు ఎల్లేష్(24) కొన్నేళ్లుగా వనస్థలిపురంలోని ఆంధ్రకేసరినగర్‌లో నివాసముంటున్నాడు. డ్రైవరుగా పనిచేస్తున్న అతడికి, ఆ ప్రాంత సమీపంలో గుడిసెలో నివసించే అమ్మాయి(15)తో పరిచయం ఏర్పడింది. గతంలో ఓసారి పెళ్లి చేసుకుంటానని అడగ్గా ఆమె ఒప్పుకోలేదు.
దీంతో సెప్టెంబర్ 22న టైలర్ పని కోసం వెళ్తుండగా ఆ అమ్మాయిని బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని ఉప్పల్ వెళ్లి, అక్కడి నుంచి బస్సులో వరంగల్ తీసుకెళ్లాడు. ఆ రోజు బంధువుల ఇంటికి తీసుకెళ్లిన ఎల్లేష్, మరుసటి రోజు సూర్యపేటలో ఉండే అతడి తమ్ముడు కుమార్ గదికి తీసుకెళ్లాడు. అక్కడే ఆమెను బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తన మాట వినకుంటే చంపేస్తానని బెదిరింపులకు గురిచేశాడు.
అదే కాలనీలో గదిని అద్దెకు తీసుకుని ఆ యువతిని అక్కడే ఉంచాడు. అక్టోబర్ 1న అమ్మాయి తల్లిదండ్రులు సమాచారం అందుకుని సూర్యపేటలో ఉంటున్న గదికి చేరుకున్నారు. యువతి తల్లిదండ్రులను చూసిన నిందితుడు ఎల్లేష్ అక్కడ్నుంచి పరారయ్యాడు.
బాధిత యువతిని తల్లిదండ్రులు తమ ఇంటికి తీసుకెళ్లారు. బుధవారం ఆంధ్రకేసరి నగర్‌లో నిందితుడు ఎల్లేష్‌ను గమనించిన బాధితురాలి తల్లిదండ్రులు వనస్థలిపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు. యువతిని కిడ్నాప్ చేసిన రోజునే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, గురువారం నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు, రిమాండ్‌కు తరలించారు.












Click it and Unblock the Notifications