బాలిక కిడ్నాప్, రేప్: కాలువలో దూకిన ప్రేమజంట
నెల్లూరు: జిల్లా కోవూరు మండలం పగుడుపాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు యువకులు ఓ బాలికను అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
పెళ్లికి ఒప్పుకోరని ప్రేమజంట ఆత్మహత్య
విశాఖపట్నం: జిల్లాలో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న ఓ ప్రేమజంట.. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరనే కారణంతో వారు నిండు ప్రాణాలు తీసుకున్నారు. అనకాపల్లిలోని ఏలేరు కాల్వలో దూకి వారు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు అప్పారావు, దుర్గాలక్ష్మీగా గుర్తించారు.

మహిళ అనుమానాస్పద మృతి
విజయనగరం జిల్లా జాగరం రెవెన్యూ పరిధి రాజుగారి సేరిపొలంలో గుర్తు తెలియని మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఆమె మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పశువుల కాపర్లు పొలంలో ఉన్న మహిళ మృతదేహాన్ని చూసి పోలీసులు, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు.
ఆదివారం సాయంత్రం పోలీసులు, ఎమ్మార్వో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అత్యాచారం చేసి హత్య చేసి వుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 40 నుంచి 45ఏళ్ల మధ్య ఆమె వయస్సు ఉంటుందని చెప్పారు. ఘటన జరిగి ఐదారు రోజులై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications