యువతిని గర్భవతిని చేసి నోట్లో యాసిడ్ పోశాడు

హైదరాబాద్: సికింద్రాబాదు నగరంలోని నేరేడుమెట్ పోలీసుస్టేషను పరిధిలోని కాకతీయనగర్‌లో శనివారం అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. నేరెడుమెట్‌కు చెందిన ఓ ప్రధాన రాజకీయ పార్టీ కార్యకర్త నల్లా నరేంద్ర ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. యువతిని గర్భవతిని చేసి, ఆపై గర్భం తీసేందుకు యువతి నోట్లో యాసిడ్ పోశాడు.
ఆందోళనకరమైన స్థితిలో యువతిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. బాధితురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు నల్లా నరేంద్ర పరారయ్యాడు. ఆసుపత్రిలో బాధితురాలిని మహిళాసంఘాల నేతలు పరామర్శించారు.
ఈతకు వెళ్లి యువకుడి మృతి
మహబూబ్‌నగర్ జిల్లాలోని మంగూల్ మండలం కోటారెడ్డిపల్లిలో ఈతకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు మృతిచెందారు. శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. శరత్‌కుమార్(25)తో పాటు అతని స్నేహితులు దాదాపు 10 మంది ఈతకు వెళ్లారు. అయితే, శరత్‌కుమార్‌కు ఈత రాకపోవడంతో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.
చెల్లెను హత్య చేసిన అన్న
కరీంనగర్ జిల్లా రాయకల్ మండలం చెర్లకొండాపూర్‌లో దారుణమైన సంఘటన జరిగింది. ఆస్తితగాదాల్లో సొంత చెల్లినే అన్న రోకలిబండతో మోది హత్య చేసి పరారయ్యాడు. దీంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు బిత్తరపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాపు చేపట్టారు.
ప్రమాదంలో డాక్టర్ దంపతుల మృతి
నిజామాబాద్ జిల్లాలోని డిచ్‌పల్లి మండలం చంద్రాయణపల్లి సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న డాక్టర్ దంపతులు మృతిచెందారు. మృతులను ఎడవల్లి మండలం ఖైతాపూర్‌కు చెందిన డాక్టర్లు ప్రవీణ్, ఉదయ్‌గా గుర్తించారు.












Click it and Unblock the Notifications