యువకుల వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య

వేధింపులు తారాస్థాయి చేరుకోవడంతో బుధవారం సాయంత్రం యువతి తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు యువకులు తనను ఈవ్ టీజింగ్ చేస్తున్నారని, ఆ కారణంగానే తాను ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె తన తల్లిదండ్రులకు తెలియజేసింది. ఈ మేరకు యువతి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇద్దరు కుమారులతో సహా తల్లి ఆత్మహత్యాయత్నం
కరీంనగర్: జిల్లాలోని జనగామలో విషాదం నెలకొంది. ఓ తల్లి తన ఇద్దరు కుమారులతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో తల్లి మృతిచెందగా, ఇద్దరు కుమారుల పరిస్థితి నిలకడగా ఉంది. సమగ్ర సర్వేలో భాగంగా సింగరేణి కార్మికుడు ఎల్లయ్య, భార్య పద్మ ఇద్దరు కుమారులతో కలిసి స్వగ్రామానికి వెళ్లారు.
ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో పద్మ తన ఇద్దరు కుమారులతో కలిసి గోదావరి సమీపంలో హెయిర్‌డై తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరిని సమీప ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ పద్మ మృతి చెందింది. కుమారుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు.












Click it and Unblock the Notifications