గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తరచూ కూల్‌డ్రింక్‌లో మత్తుమందు ఇచ్చి మామ రేప్: గర్భం దాల్చిన బాలిక

|
Google Oneindia TeluguNews

నెల్లూరు: నగరంలోని నక్కలొల్ల సెంటర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కామంతో కళ్లు మూసుకుపోయి ఓ బాలికపై వరుసకు మామ అయ్యే వ్యక్తి అత్యాచారం చేశాడు. తరచూ బాలికకు కూల్‌డ్రింక్స్‌లో మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు.

దీంతో బాలిక గర్భం దాల్చింది. బాలిక బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

A girl raped by her uncle

అనుమానంతో భార్యను హతమార్చిన భర్త

ప్రకాశం జిల్లాలోని చినగంజాం మండలం కొత్తపాలెం పంచాయతీ మాలపల్లెలో అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యను హతమార్చాడు. ఆ తర్వాత పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

కాల్వలోకి దూసుకెళ్లిన కారు: ఒకరి మృతి

గుంటూరు: వేగంగా వచ్చిన కారు కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. పలువురు విద్యార్థులు మద్యం మత్తులో వేగంగా కారు నడిపడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

తెనాలి మండలం సంగం జాగర్లమూడి వద్ద ఓ కారు కాల్వలోకి దూసుకెళ్లగా ఓ యువకుడు మరణించాడు. మరో నలుగురు యువకులు స్వల్ప గాయాలతో క్షేమంగా బయటపడ్డారు. మద్యం మత్తులో కారు నడిపారని పోలీసులు చెప్పారు. కారులో ఉన్న వారు స్థానిక యూనివర్శిటీ విద్యార్థులని పోలీసులు చెప్పారు.

English summary
A girl raped by her uncle in Nellore district and police case filed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X