కరస్పాండెంట్ వేధింపులు: విద్యార్థిని ఆత్మహత్య
ఖమ్మం: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి మంచిమార్గంలో నడిపించాల్సిన ఓ పాఠశాల కరస్పాండెంట్.. కామంతో కళ్లుమూసుకుపోయి ఓ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. మనస్తాపానికి గురైన ఆ విద్యార్థిని మరణానికి కారకుడయ్యాడు. ఈ విషాధ ఘటన కారేపల్లి మండలం మాదారం పంచాయతీ, కొత్తూరు తాండాలో చోటు చేసుకుంది.
కొత్తూరు తాండాకు చెందిన బానోతు నాగమణి(15) మాదారంలోని ప్రగతి విద్యాలయంలో పదో తరగతి చదువుతోంది. పాఠశాల కరస్పాండెంట్ రాంరెడ్డి వేధిస్తున్నట్లు తండ్రి శంకర్‌కు గురువారం ఉదయం తెలిపింది. ఈ విషయమై నిలదీసేందుకు తండ్రి పాఠశాలకు వెళ్లగానే ఇంట్లో ఉన్న పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.
ఇద్దరి ఆత్మహత్య: జ్వరంతో మహిళ మృతి

జ్వరంతో బాధపడుతూ రావికంపాడు గ్రామంలో ఇమ్మడి రాములమ్మ (55) అనే మహిళ మృతిచెందింది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలావున్నాయి. రాములమ్మ ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. ఆరోగ్యం మరింత క్షీణించడంతో రెండురోజుల కిందట మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాములమ్మ మృతిచెందింది.
భర్త గతంలో మృతిచెందగా ఇద్దరు కుమారైలు, ఒక కుమారుడు ఉన్నారు. ఇదిలావుండగా వారం రోజులుగా గ్రామంలో జ్వరాలు విజృంభించాయి. ప్రతి ఇంటిలో ఒకరిద్దరూ జ్వరంతో బాధపడుతూ మంచంపట్టారు. స్థోమత లేనివారు స్థానిక ఆర్‌ఎంపిల వద్ద చికిత్స పొందుతున్నారు. దీంతో రోగులకు సరైన వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వరంగల్: అప్పుల బాధతో వరంగల్ జిల్లాలో ఓ అన్నదాత ఆత్మహత్య చేసుకోగా మరో ఘటనలో విద్యుత్తు కోతలతో వంట చేతికిరాదన్న ఆందోళనతో మిర్చి రైతు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. నర్మెట్ట మండలం నర్సాపూర్‌కి చెందిన పెద్ది మహేశ్(29) అప్పుల బాధతో గురువారం తెల్లవారుజామున పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. నర్సంపేట మండలం కమ్మపల్లికి చెందిన అజ్మీర నమ్మునాయక్ కూడా అప్పులు తీర్చలేక పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.












Click it and Unblock the Notifications