నివాస యోగ్యం కాదు, ముప్పే: గ్రీన్ ట్రిబ్యూనల్‌లో మరో పిటిషన్
అమరావతి: పర్యావరణానికి ముప్పు కలుగుతోందంటూ, నివాసయోగ్యం కాదంటూ ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అమరావతి నిర్మాణం కారణంగా గ్రీన్ కారిడార్‌కు పెను ముప్పు తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తూ ఇప్పటికే పలు పిటిషన్లు గ్రీన్ ట్రైబ్యూనల్ లో దాఖలైన విషయం తెలిసిందే.
అయితే ఈ పిటిషన్లన్నింటినీ చంద్రబాబు సర్కారు ట్రైబ్యూనల్ లో సమర్ధంగా తిప్పికొట్టింది. కృష్ణా పరివాహక ప్రాంతంలో నిర్మిస్తున్న అమరావతి నివాస యోగ్యం కాదంటూ తాజాగా మరో పిటిషన్ దాఖలైంది.

వరద ముప్పు పొంచి ఉన్న ప్రాంతంలో రాజధానిని ఎలా నిర్మిస్తారంటూ దాఖలైన ఈ పిటిషన్ పై నిన్న ట్రైబ్యూనల్ సుదీర్ఘ వాదనలను విన్నది. ఈ విచారణకు ప్రముఖ పర్యావరణవేత్త మేధా పట్కార్ కూడా హాజరయ్యారు.
పిటిషనర్ల వాదనలు విన్న ట్రైబ్యూలన్ మరిన్ని వివరాలతో అనుబంధ పిటిషన్ ను దాఖలు చేయాలని సూచిస్తూ తదుపరి విచారణను సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications