సీఎం జగన్ ఆతిథ్యంతో ప్రధాని హ్యాపీ - వీడియో షేరింగ్ : చిరంజీవి - రోజా సెల్ఫీ సైతం..!!

ప్రధాని మోదీ ఏపీ పర్యటన సమయంలో లభించిన ఆతిథ్యంలో హ్యాపీ ఫీలయ్యారు. హైదరాబాద్ లో రెండు రోజుల పార్టీ సమావేశాల తరువాత ఆయన హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్నారు. ఆయన ఏపీలో దిగిన సమయం నుంచి గవర్నర్ - సీఎం జగన్ ఆయనను ఘన స్వాగతం పలికారు. ప్రధాని హెలికాప్టర్ లోనే సీఎం సైతం భీమవరం వెళ్లారు. భారీ జనసందోహం నడుమ అల్లూరి సీతారామ రాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అల్లూరి ధీరత్వాన్ని - స్పూర్తిని కొనియాడారు. అయితే, అదే వేదిక పైన ప్రధాని - సీఎం జగన్ మధ్య కనిపించిన సాన్నిహిత్యం రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమైంది.

గుర్తుండిపోయే పర్యటన అంటూ ప్రధాని..

ఇక.. అదే వేదిక పైన మంత్రి హోదాలో రోజా - ప్రత్యేక అతిధిగా చిరంజీవి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. వేదిక పైన చిరంజీవి - సీఎం జగన్ ఆలింగనం చేసుకున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. సీఎం జగన్ తన ప్రసంగంలో చిరంజీవిన తన సోదరుడు అంటూ సంభోదించారు. ఇక, రోజా కార్యక్రమం చివర ప్రధాని - సీఎం జగన్ తో కలిసి సెల్ఫీలు దిగటం.. చిరంజీవితో దిగిన సెల్ఫీలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ అయ్యారు. ఇక, తన భీమవరం పర్యటన ముగించుకొని..గన్నవరం చేరుకున్న ప్రధానికి గవర్నర్ - సీఎం జగన్ వీడ్కోలు పలికారు.

ప్రత్యేకంగా వీడియో షేర్ చేస్తూ

ప్రత్యేకంగా వీడియో షేర్ చేస్తూ

అక్కడ నుంచి అహ్మదాబాద్ చేరుకున్నారు. మరుసటి రోజు ప్రధాని తన భీమవరం పర్యటన పైన ఒక వీడియో షేర్ చేసారు. ప్రధాని తన ట్విట్టర్ ఖాతాలో భీమవరం కార్యక్రమం గురించి పెట్టిన పోస్టింగ్ సైతం ఇప్పుడు వైరల్ అవుతోంది. తన భీమవరం పర్యటన మెమోరబుల్ కార్యక్రమంగా అభివర్ణించారు. దీనికి కొనసాగింపుగా కార్యమ్రంలో హైలైట్స్ అంటూ వీడియో షేర్ చేసారు. అందులో సీఎం జగన్ తనకు అతిథ్యం ఇచ్చిన విజువల్స్ తో పాటుగా భీమవరం సభలో హైలైట్స్ .. అక్కడ ప్రజల స్పందన..అల్లూరి విగ్రహావిష్కరణ..వంటివి జత చేసారు.

వైరల్ అవుతున్న ప్రధాని వీడియో

వైరల్ అవుతున్న ప్రధాని వీడియో

ఇక, ప్రధాని సభా వేదిక పైన చిరంజీవితో ప్రత్యేకంగా ముచ్చటించారు. చిరంజీవి భుజం తట్టి అభినందించారు. చిరంజీవి విజువల్స్ తో పాటుగా.. రోజా సెల్ఫీ సందడి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఇప్పుడు ప్రధాని తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసిన ఈ రెండు విమిషాల నిడివి ఉన్న వీడియో వైసీపీ సర్కిల్స్ పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. తన భీమవరం పర్యటనలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజుకు ఘన నివాళులు అర్పించడం జరిగిందని తన ట్వీట్ లో ప్రధాని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+