సోము వీర్రాజుకు భారీ అవమానం
భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు భారీగా అవమానం జరిగింది. విశాఖపట్నంలోని ఎన్‌టీపీసీ టౌన్‌షిప్‌లో పీఎం రోజ్‌గార్ మేళా జరిగింది. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఆయనను సీఐఎస్ఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు. తాను పార్టీ అధ్యక్షుడినని చెప్పినప్పటికీ వారు అనుమతించలేదు. దీంతో ఆయన కార్యక్రమం జరిగే గేటు దగ్గరే నిలిచిపోవాల్సి వచ్చింది. ఈ విషయంపై 'డెక్కన్ క్రానికల్'లో కథనం వచ్చింది.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ కార్యక్రమాన్ని వర్చువల్ మోడ్ లో ప్రారంభించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అయితే కిషన్ రెడ్డితోపాటు సోము వీర్రాజు కూడా ఫంక్షన్ హాల్ లోకి వెళ్లడానికి ప్రయత్నించగా సీఐఎస్ఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు. దీనిపై సోము ఆగ్రహం వ్యక్తం చేశారు. గార్డులపై పెద్దపెద్దగా అరిచారు. తర్వాత ఈ విషయం కిషన్ రెడ్డికి తెలియడంతో ఆయన గేటుదగ్గరకు వచ్చి వీర్రాజును లోపలికి అనుమతించాలని సీఐఎస్ఎఫ్ సిబ్బందికి సూచించడంతో వీర్రాజు చల్లబడ్డారు. ఆయన బీజేపీ ఏపీ అధ్యక్షుడని తమకు తెలియదని సీఐఎస్ఎఫ్ అధికారులు చెప్పారు. రోజ్ గార్ మేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రసంగించారు. మిషన్ కర్మయోగి ప్రారంభం మాడ్యూల్‌ను కూడా ప్రారంభించారు. ప్రధాని ప్రసంగం తర్వాత కిషన్ రెడ్డి 200 మందికి సీఐఎస్‌ఎఫ్ ఉద్యోగ నియామక పత్రాలను అందించారు. సోము వీర్రాజుకు జరిగిన అవమానంపై బీజేపీ ఏపీలో చర్చ జరిగింది. పార్టీ తరఫున ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకపోవడం, తద్వారా ప్రజల్లోకి వెళ్లకపోవడంతో ఆయన్ను గుర్తించడం కష్టమైందనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి.













Click it and Unblock the Notifications