మట్లాడాలని పిలిచి ఇంటర్ విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్

వివరాల్లోకి వెళితే.. ఇంటర్ చదువుతున్న విద్యార్థినిని ఓ యువకుడు గత కొద్దిరోజలుగా ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. ఈ క్రమంలో అతడు రెండు రోజుల క్రితం మాట్లాడాలంటూ నమ్మించి విద్యార్థినిని పాలకొండ శివారు ప్రాంతంలోకి తీసుకెళ్లాడు.
అప్పటికే అక్కడ ఉన్న మరో ఇద్దరితో కలిసి అతడు విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచారాన్ని సెల్‌ఫోన్లో చిత్రీకరించిన యువకులు ఈ విషయాన్ని బయటపెడితే నెట్‌లో పెడతామంటూ విద్యార్థినిని బెదిరించారు. గురువారం బాధితురాలు తల్లిదండ్రులకు విషయం తెలియజేయడంతో వారు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
సముద్రంలో బోటు గల్లంతు
తూర్పుగోదావరి: కాకినాడ సమీపంలోని భైరవపాలెం వద్ద సముద్రంలో మత్స్యకారుల బోటు గల్లంతైంది. బోటులో అచ్యుతాపురం మండలం కొండపాలానికి చెందిన ఏడుగురు మత్స్యకారులు ఉన్నారు. వీరిలో ఐదుగురు మత్స్యకారులు సురక్షితంగా బయటపడగా మరో ఇద్దరు గల్లంతయ్యారు.
వెంటనే రంగంలోకి దిగిన కోస్ట్‌గార్డు సిబ్బంది ఇద్దరు మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన మత్స్యకారుల పేర్లు దేవుడు, తాతయ్యగా గుర్తించారు. వీరంతా నాలుగు రోజుల క్రితం వేటకోసం సముద్రంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications